అనారోగ్యంతో జెస్సీ బయటకు.. ట్విస్ట్‌ ఇవ్వబోతున్న బిగ్ బాస్ టీమ్

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 నుండి నిన్నటి ఎపిసోడ్‌ లో విశ్వ ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే.మరో ఎలిమినేషన్‌ కు వారం సమయం ఉండగానే మరో కంటెంస్టెంట్‌ బయటకు వచ్చేశాడు.

 Telugu Bigg Boss 5 Jessie Get Eliminated ,telugu Bigg Boss 5, Jessie , Elimina-TeluguStop.com

బిగ్‌ బాస్ సీజన్ 5 లో ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చిన ర్యాంప్ వాకర్ కమ్‌ మోడల్ అయిన జెస్సీ అనూహ్యంగా అనారోగ్య కారణంతో బయటకు వచ్చేశాడు.ఆయన అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు.

కళ్లు సరిగా కనిపించక పోవడంతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు ఆయనకు ఉన్నాయి.దాంతో అనారోగ్య కారణాల దృష్ట్యా జెస్సీని పంపించేసినట్లుగా చెబుతున్నారు.

అయితే ఇంటి సభ్యులకు జెస్సీని పూర్తిగా బయటకు పంపిచినట్లుగా చెబుతున్నారు కాని అతడు ఆసుపత్రికి వెళ్లి ఆ తర్వాత సీక్రెట్‌ రూమ్‌ లో జాయిన్‌ అవుతాడు.

రెండు లేదా మూడు రోజుల తర్వాత అతడు మళ్లీ హౌస్ లో జాయిన్ అవుతాడు అంటున్నారు.

బిగ్‌ బాస్ నుండి ఇప్పటి వరకు చూడని ట్విస్ట్‌ లను నేటి ఎపిసోడ్‌ లో చూడబోతున్నట్లుగా చెబుతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న బిగ్‌ బాస్ ను ఈ సీజన్ లో కొందరు కంటెస్టెంట్స్ వల్ల ఆసక్తి పోతుంది.

కంటెస్టెంట్స్ చాలా యాక్టివ్‌ గా ఉండాల్సింది పోయి చాలా నీరసంగా నిరుత్సాహంగా ఉంటున్నారు.అందుకే బిగ్‌ బాస్ కొన్ని సార్లు ట్విస్టులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Telugu Bigg Boss, Jessie, Shannu, Siri, Sunn, Telugu Biggboss, Telugu-Movie

మొత్తానికి జెస్సీని బయటకు పంపించడం ద్వారా చాలా పెద్ద నిర్ణయంను బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకున్నారని.దాంతో పాటు వారు ఇవ్వబోతున్న ట్విస్ట్‌ షో కు మంచి ఆధరణ పెరిగేలా చేస్తుందని.జనాలు బిగ్‌ బాస్ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జెస్సీ వెళ్లి పోవడం వల్ల ఖచ్చితంగా సిరి మరియు షన్నూ లు చాలా బాధ పడే అవకాశం ఉంది.

సన్నీ కూడా జెస్సీ కి సన్నిహితుడిగా మారాడు.కనుక ఖచ్చితంగా జెస్సీ వెళ్లి పోతే హౌస్‌ లో కాస్త ఎమోషనల్‌ అవ్వడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube