BB5 : సరయు ఇంటర్వ్యూలు ఇవ్వక పోవడానికి కారణం ఏంటీ?

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 మొదటి కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ జరిగింది.సరయును మొదటి వారంలో ప్రేక్షకులు ఎలిమినేట్‌ చేశారు అంటూ బిగ్ బాస్ టీమ్ ప్రకటించి ఆమెను బయటకు పంపించేశారు.

 Telugu Bigg Boss 5 First Elimination Sarayu Where-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న సరయు అర్థాంతరంగా బయటకు వెళ్లి పోవడంను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు.ఆమె కూడా తన ఎలిమినేషన్ తర్వాత కనీసం బయట కనిపించడం లేదు.

ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించగా నో చెప్పింది.బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఏ కంటెస్టెంట్స్ అయినా ప్రముఖ న్యూస్‌ ఛానల్స్ తో పాటు అన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉండే వారు.

 Telugu Bigg Boss 5 First Elimination Sarayu Where-BB5 : సరయు ఇంటర్వ్యూలు ఇవ్వక పోవడానికి కారణం ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని సరయు మాత్రం కనిపించకుండా పోయింది.ఆమెను ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 వారు సంప్రదించేందుకు ప్రయత్నించగా కనిపించడం లేదంటూ వారు చెబుతున్నారు.

ఆమె డిప్రెషన్ కు గురయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Bb5, Bigg Boss Telugu, Nagarjuna, Sarayu, Star Maa-Movie

సరయు చాలా సెన్సిటివ్‌. ఆమె బూతులు మాట్లాడుతూ రఫ్‌ గా ఉంటుంది కాని ఇలాంటి ఓటములను ఆమె తట్టుకోలేదు అంటూ ఆమె టీమ్‌ మెంబర్స్ అంటున్నారు.ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ బజ్ లో ఎంత కోపంను ప్రదర్శించిందో అందరం చూశాం.

ఫొటోలను పగులకొట్టి దారుణంగా వ్యవహరించింది.ఆమె చేసిన వ్యాఖ్యలు.

ఆమె వ్యవహరించిన తీరు ఆమె సహనం కోల్పోయి మరీ దారుణంగా ప్రవర్తిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.అయినా కూడా ఆమెకు సంబంధించిన ఇంటర్వ్యూల కోసం జనాలు కొందరు ఎదురు చూశారు.

కాని ఇకపై ఆమె ఇంటర్వ్యూలు కనిపించవు అంటూ కొందరు అంటున్నారు.ఎందుకంటే ఆమె మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఆసక్తిగా లేదు అంటున్నారు.

బిగ్‌ బాస్‌ సీజన్ 5 లో ఆమె మొదట ఎలిమినేషన్ అవ్వడం తట్టుకోలేక పోతుంది.ఒక వేళ ఆమె కనుక మీడియా ముందుకు వస్తే నిర్వాహకులను మరియు అందులోని కంటెస్టెంట్స్ ను దుమ్ము దులపడం ఖాయం అంటున్నారు.

#Nagarjuna #Sarayu #Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు