బిగ్‌బాస్‌ : కాజల్‌ అతి తెలివి కొంప ముంచనుందా?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 అప్పుడే మొదటి వారం ముగియబోతుంది.నేడు నాగార్జున వస్తాడు.

 Telugu Bigg Boss 5 First Elimination Details, Bb5, Bigg Boss 5, Rj Kajal, Telugu-TeluguStop.com

ఈ సీజన్ లో మొదటి ఎలిమినేషన్‌ ఎవరు అయ్యి ఉంటారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ వారం ఎలిమినేషన్‌ లో యాంకర్ రవి, మానస్, జెస్సీ, హమీదా మరియు కాజల్ లు ఉన్నారు.

ఈ అయిదుగురిలో ఖచ్చితంగా జెస్సీకి మూడింది అంటూ అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా కాజల్ తన కొంప తానే కూల్చుకున్నట్లుగా ఓవర్ గా రియాక్ట్‌ అవుతూ ప్రతి సీజన్ లో ఒకరు ఉంటారు అన్నట్లుగా ఈసారి ఈమె ఉంది.

ఓవర్‌ యాక్షన్ ను భరించలేక జుట్టు పీక్కుంటున్న వారు చాలా మంది ఉన్నారు.అందుకే ఈమెకు ఓట్లు వేయలేదు అని తెలుస్తోంది.

జెస్సీ కాస్త చిన్నపిల్లాడి మనస్థత్వంతో వ్యవహరిస్తున్నాడు.దాంతో అతడికి కూడా ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది.

స్టార్‌ మా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జెస్సీ మరియు కాజల్ ల మద్య ఓట్లు దోబూచులాడాయి.చివరకు జెస్సీ మరియు కాజల్ ల విషయంలో జెస్సీకి అదృష్టం కలిసి వచ్చిందంటూ టాక్ వినిపిస్తుంది.

హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా తాను బిగ్ బాస్ ను చదివేశాను.ఈ సమయంలో ఏం చేయాలో నాకు తెలుసు.ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలుసు అంటూ ఇంటి సభ్యులను మరియు ప్రేక్షకులను విసిగిస్తుంది.

Telugu Bigg Boss, Biggboss, Hameeda, Jessie, Rj Kajal, Sarayu-Movie

దాంతో ఆమెకు ఎలిమినేషన్‌ తప్పదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఊహిస్తున్నారు.ఏం జరుగుతుందో చూడాలి.జెస్సీకి ఈ వారం ఛాన్స్ వస్తే తప్పకుండా ముందు ముందు అతడు మెచ్యూర్డ్‌ గా ఆడుతాడు అంటూ అంతా నమ్మకంతో అతడికి ఓట్లు వేశారు.

కనుక అతడు ఈ వారం లో సేఫ్ అయినట్లే అంటున్నారు.ఆర్‌ జే కాజల్‌ తన బ్యాగ్స్ ను సర్దేసుకుని బయటకు వచ్చేయాల్సి రావచ్చు అంటున్నారు.మరి కొన్ని గంటల్లో క్లారిటీ రావచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube