వారిద్దరి కొట్లాట సోహెల్‌కు కలిసి వస్తుందనుకుంటున్న అభిమానులు

తెలుగు బిగ్‌బాస్‌ లో సోహెల్‌ జర్నీ అనూహ్యంగా ఫైనల్‌ వరకు సాగేలా కనిపిస్తుంది.మొన్నటి వరకు ఈయన ఫైనల్‌ 5 లో నిలవడం కష్టమే అన్నారు.

 Telugu Bigg Boss 4 Winner Race May Be Not Abhijeet Also Sohel, Abhijeet, Sohel,-TeluguStop.com

ఆ తర్వాత ఖచ్చితంగా సోహెల్‌ ఫైనల్‌ 5 లో ఉంటాడు అంటూ ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్నారు.ఇదే సమయంలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విజేతగా కూడాస సోహెల్‌కు అవకాశం ఉంది అంటున్నారు.

గత వారం రోజులుగా అభిజిత్‌ మరియు సోహెల్‌ లు టాప్‌ 2 లో ఉంటారు అంటూ గట్టిగా నమ్మకంగా చెబుతున్నారు.అభిజిత్‌ విజేతగా నిలిస్తే సోహెల్‌ నెం.2 గా నిలుస్తాడని అంతా భావించారు.కాని అభిజిత్‌ మరియు అఖిల్‌ల మద్య పదే పదే గొడవ జరుగుతున్న నేపథ్యంలో అభిజిత్‌ గ్రాఫ్‌ తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఆయన ఇప్పటికే కాస్త డల్‌గా కనిపిస్తున్నాడు అఖిల్‌ తో గొడవ పడి పడి అలసి పోయినట్లుగా అయ్యాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.మైండ్‌ గేమ్‌ మాస్టర్‌ అనూహ్యంగా నెం.2లో నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.

Telugu Abhijeet, Akhil, Akhil Abhijeet, Bb Top, Bb, Bigg Boss, Sohel, Sohel Top,

బిగ్‌బాస్‌లో సోహెల్‌ ఎవరికి తెలియని ఒక వ్యక్తిగా జర్నీ షురూ చేశాడు.కాని అతడు అనూహ్యంగా తన పద్దతి మార్చుకుంటూ అందరిని ఆకట్టుకుంటూ కథ వేరే ఉంటుంది అంటూ తనదైన శైలి స్లాంగ్‌ తో మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించి ఫైనల్‌ వరకు వెళ్లే అర్హతను దక్కించుకున్నాడు.ఇప్పుడు ఆయన బిగ్‌బాస్‌ విజేతగా కూడా నిలిచే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి అంటే ఏ స్థాయిలో అతడు గ్రాఫ్‌ పైకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి ఒక్కరు కూడా ఆయన తీరును ఓన్‌ చేసుకుంటున్నారు.కుర్రాళ్లు మేము ఇలాగే ఉంటాం కదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అలా మొత్తానికి బిగ్‌బాస్‌లో సోహెల్‌ ఓ రేంజ్‌లోకి వెళ్లి పోయాడు.మరి విజేతగా నిలుస్తాడా అనేది చూడాలి.

అఖిల్‌ అభిజిత్‌ల గొడవ వల్ల ప్రయోజనం ఏమైనా పొందితే ఈజీగానే మనోడు విజేత అవ్వొచ్చు అంటున్నారు.మరి అది సాధ్యమా అభికి ఉన్న క్రేజ్‌ను సోహెల్‌ క్రాస్‌ చేసేనా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube