ఈ వారం డేంజర్‌ జోన్‌ లో వారిద్దరు

తెలుగు బిగ్‌ బాస్‌ పదవ వారంలో ఎవరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయంగా మారింది.ఈ వారంలో అభిజిత్‌, హారిక, అరియానా, సోహెల్‌, మెహబూబ్‌ మరియు మోనాల్‌ లు ఎలిమినేట్‌ కు నామినేట్‌ అయ్యారు.

వీరిలో ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది.ఇప్పటికే చాలా సార్లు సేవ్‌ అయిన అభిజిత్‌ ఈ వారం కూడా సేవ్‌ అవ్వబోతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇక హారిక ఎప్పటిలాగే మీడియం ఓట్లు దక్కించుకుని గట్టెక్కబోతుంది.సోహెల్‌ కూడా పర్వాలేదు అన్నట్లుగా ఓట్లు పొందుతున్నాడు.

మోనాల్‌ ఎప్పటిలాగే ఏదో ఒక మాయ చేసి సేవ్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక మిగిలి ఉన్న అరియానా మరియు మెహబూబ్‌ల్లో తీవ్రమైన పోటీ ఉంది.

వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది.కెప్టెన్సీ టాస్క్‌లో ఓవర్‌ యాక్షన్‌.

ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్‌ లో ఆమె యాటిటూడ్‌ వల్ల ప్రేక్షకుల్లో వ్యతిరేకత పొందింది.లేదంటే ఆమె ఫైనల్‌ 5 అంటూ మొన్నటి వరకు అంతా బలంగా నమ్మారు.

Telugu Ariyana, Mehaboob, Nagarjuna, Telugu Bb-Latest News - Telugu

అమ్మ రాజశేఖర్‌ వెళ్లి పోయిన తర్వాత ఆమె ఒంటరి అన్నట్లుగా ఫీల్‌ అవుతుంది.కనుక ఆమెను బిగ్‌బాస్‌ హౌస నుండి పంపించడమే ఉత్తమం అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారట.బిగ్‌బాస్‌ సీజన్‌ 4 లో అనూహ్యంగా ఎలిమినేషన్స్‌ జరుగుతున్నాయి.కనుక మెహబూబ్‌ కంటే కూడా అరియానాకు ఎక్కువ ఓట్లు వచ్చినా టీం నిర్ణయించుకుంటే ఆమెనే ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉంది.

ఎందుకంటే మెహబూబ్‌ ఉంటేనే టాస్క్‌లు రసవత్తరంగా సాగుతాయి అనేది వారి ప్లాన్‌ అయ్యి ఉంటుంది.అయితే ఈసారి వారు ఎలా ఆలోచిస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు.

ఖచ్చితంగా బిగ్‌బాస్‌ నుండి అయితే ఈ వారాంతంలో అరియానా లేదా మెహబూబ్‌లు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.వీరిద్దరిలో ఎవరు పోయినా ఆశ్చర్యం లేదు.

కాని వీరు కాకుండా మరెవ్వరు పోయినా కూడా పెద్ద ట్విస్ట్‌ గా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube