బిగ్‌బాస్‌ః సిగ్గు చేటు ఎలిమినేషన్‌ మాత్రమే కాదు నామినేషన్‌ కూడా లీక్‌ చేస్తున్నారు  

తెలుగు బిగ్‌ బాస్‌ మొదటి మూడు సీజన్‌ లు ఆదివారం ఎలిమినేట్‌ అవ్వబోతున్నది ఎవరు అనే విషయం ముందు రోజు లీక్‌ అయ్యేది.కాని సీజన్‌ 4 విషయంలో మరింత అడ్వాన్స్‌ గా లీక్‌ అవుతున్నాయి.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Leaked Matters About Elimination Nominations

ప్రతి శనివారం సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఆదివారం వెళ్లి పోయేది ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.అది కూడా నూటికి నూరు శాతం క్లారిటీ వస్తుంది.

ప్రస్తుతం ఫ్లోర్‌ ఆడియన్స్‌ కూడా లేరు.అయినా కూడా బిగ్‌ బాస్‌ కు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా లీక్‌ చేస్తున్నారు.

TeluguStop.com - బిగ్‌బాస్‌ః సిగ్గు చేటు ఎలిమినేషన్‌ మాత్రమే కాదు నామినేషన్‌ కూడా లీక్‌ చేస్తున్నారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇది కావాలని చేస్తున్నారా లేదంటే వారికి తెలియకుండా చేస్తున్నారా అనేది తెలియడం లేదు.గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా లీక్ ను ఆపేయగలరు.

కాని అది మాత్రం సాధ్యం కావడం లేదు.అలా ఎవరు లీక్‌ చేస్తున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు.

బిగ్‌ బాస్‌ లో గతంలో ఎప్పుడు లేని విధంగా సోమవారం ఎపిసోడ్‌ కు సంబంధించిన నామినేషన్‌ పక్రియ లీక్‌ అవుతుంది.ఆదివారం రాత్రి వరకే తదుపరి వారంలో నామినేషన్‌లో ఉండబోతున్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ వస్తోంది.మరీ ఇంతగా లీక్‌ అవ్వడానికి కారణం ఏంటీ అంటూ కనీసం ‘స్టార్‌ మా’ వారు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.వారు లీక్‌ అవ్వడం వల్ల ఇంకా పబ్లిసిటీ దక్కి రేటింగ్‌ వస్తుందేమో అని భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

వీక్‌ డేస్‌ రేటింగ్‌ను పెంచేందుకు భాగంగా ఇలా ఎలిమినేషన్‌ నామినేషన్‌ను లీక్‌ చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గడచిన మూడు నాలుగు వారాలుగా ఆదివారం రోజే సోమవారం నామినేషన్‌లో ఉండేది ఎవరు అంటూ క్లారిటీగా చెబుతున్నారు.

నిన్నటి నామినేషన్‌ గురించి కూడా ఆదివారం క్లారిటీ వచ్చింది.నామినేషన్‌ లో అరియానా మరియు సోహెల్‌ లు ఒకరిని ఒకరు నామినేట్‌ చేసుకుంటారు.అయినా కూడా వారు ఇద్దరు మాత్రమే నామినేషన్‌ లో ఉండకుండా మిగిలిన వారు అంతా కూడా ఉంటారు అన్నారు.అభిజిత్‌ ను హారిక మరియు అఖిల్‌ ను మోనాల్‌ నామినేట్‌ చేస్తుందని వార్తలు వచ్చాయి.

అదే జరిగింది.బిగ్‌బ ఆస్‌ లీక్‌ ల వల్ల కొందరికి ఆసక్తి తగ్గుతుంది.

ఇలాంటి చిన్న విషయాన్ని లీక్ కాకుండా ఆపలేని టీం ఎందుకు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

#Abhijith #Sohel #Akhil Bb4 #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు