బిగ్‌బాస్‌ : అఖిల్‌, మోనాల్‌ వ్యవహారంకు ఇంతటితో ఫుల్‌ స్టాప్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు వచ్చింది.ఈ సీజన్‌ ఆరంభం నుండి కూడా అఖిల్‌ మరియు మోనాల్‌ ల మద్య ఏదో జరుగుతుంది అంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు.

 Telugu Bigg Boss 4 Latest Monday Episode Highlights , Bigg Boss 4,12th Week Nomi-TeluguStop.com

నాగార్జున కూడా మోనాల్‌ మరియు అఖిల్‌ల మద్య ప్రేమ లేకున్నా ప్రేక్షకులకు ఉన్నట్లుగా అర్థం అయ్యేలా మాట్లాడటం చేశాడు.వారిద్దరి కాంబో షాట్స్‌ ఎక్కువగా వేయడంతో పాటు వారిద్దరిని ప్రతి చోట హైలైట్‌ చేయడం వంటివి చేస్తూ వచ్చారు.

ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్‌ విషయంలో హారికకు మోనాల్‌ సపోర్ట్‌ చేసి అఖిల్‌ ఓటమికి కారణం అయ్యిందో అప్పుడే అతడు మోనాల్‌కు దూరం అయ్యాడు.తాజా ఎపిసోడ్‌లో అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఎవరి గేమ్‌ వారు ఆడుకుందాం.ఇద్దరి మద్య ఇకపై ఏమీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుందాం అన్నట్లుగా మెల్లగా మోనాల్‌కు అఖిల్‌ గుడ్‌ బై చెప్పే ప్రయత్నం చేశాడు.

ఈ వారంలో అఖిల్‌ నామినేషన్‌ పక్రియలో మోనాల్‌ను అఖిల్‌ నామినేట్‌ చేయాలనుకున్నాడని అతడి మాటలతో అర్థం అయ్యింది.

సోమవారం నామినేషన్‌ పక్రియ రసవత్తరంగా సాగింది.

లక్‌ ఆధారంగా ఈ వారం నలుగురు మొదటి రౌండ్‌లో ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు.గార్డెన్‌ ఏరియాలో ఉన్న క్యాప్‌లను కంటెస్టెంట్స్‌ ధరించాల్సి ఉంటుంది.

హారిక కెప్టెన్‌ అవ్వడం వల్ల ఆమెకు ఈ వారం నామినేషన్‌ నుండి ఇమ్యూనిటీ ఉంది.కనుక మిగిలిన ఆరుగురు పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కో టోపీ దరించారు.

ఆ టోపీల్లో నాలుగు టోపీలు ఎరుపు రంగును రెండు గ్రీన్‌ రంగును కలిగి ఉన్నాయి.ఎరుపు రంగు టోపీలను పెట్టుకున్న వారు ఎలిమినేట్‌ అయినట్లు.

అభిజిత్‌, అరియానా, అఖిల్‌ మరియు అవినాష్‌లు ఎరుపు రంగు క్యాప్‌ లు పెట్టుకున్నారు.

Telugu Abhijeet, Akhil, Avinash, Bigg Boss, Bigg Boss List, Harika, Love Track,

ఆ నలుగురు నామినేట్‌ అవ్వగా గ్రీన్‌ పెట్టుకున్న మోనాల్‌ మరియు సోహెల్‌లు సేవ్‌ అయ్యారు.బిగ్‌బాస్‌ నామినేట్‌ అయన వారికి బయట ఉన్న వారిని ఒప్పించే ప్రయత్నం చేసుకోమన్నాడు.కాని మోనాల్‌ కాని సోహెల్‌ కాని ఒప్పుకోలేదు.

అఖిల్‌ తన కోసం ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవ్వమని కోరగా అందుకు మోనాల్‌ నో చెప్పింది.మీరే కదా ఎవరి గేమ్‌ వారే ఆడుకుందాం అన్నారు అంటూ మోనాల్‌ అఖిల్‌కు షాక్‌ ఇచ్చింది.

హారిక తన కెప్టెన్సీ పవర్‌ ను ఉపయోగించి అభిజిత్‌ను సేవ్‌ చేసి మోనాల్‌ ను నామినేట్‌ చేసింది.ఈ వారం నామినేషన్‌లో మోనాల్‌, అరియానా, అఖిల్‌ మరియు అవినాష్‌లు ఉన్నారు.

వీరిలో ఎవరు వెళ్తారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube