బిగ్‌బాస్‌ : అఖిల్‌, మెహబూబ్‌లు బుద్దిలేని పని, కెప్టెన్సీ ఇమ్యూనిటీ మిస్‌

తెలుగు బిగ్‌బాస్‌ 10వ వారం కెప్టెన్సీ టాస్క్‌ రసాబాసగా జరిగింది.అఖరి బంతి అనే టాస్క్‌ లో భాగంగా ఎవరి ఫొటో ఉన్న బంతిని వారు పట్టుకోకుండా ఇతరుల బంతిని పట్టుకోవాల్సి ఉంటుంది.

 Telugu Bigg Boss 4 Latest Episode Highlights ,abhijit ,akhil,bb4 Telugu ,mehaboo-TeluguStop.com

అంటే వారి బంతిని వారు కాకుండా మరెవ్వరైనా బాస్కెట్‌ లో వేయాలి.ఈ టాస్క్‌ లో ఇంటి సభ్యులు అంతా కూడా ఆడారు.

మొదట్లోనే లాస్య, మోనాల్‌, అరియానా, అవినాష్‌, అభిజిత్ మరియు హారికలు వెళ్లి పోయారు.అప్పుడు ఆట రసవత్తరంగా సాగింది.

ఆటలో కేవలం అఖిల్‌, సోహెల్‌ మరియు మెహబూబ్‌లు మాత్రమే ఉన్నారు.ఆ ముగ్గురిలో సోహెల్‌ అప్పటికే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఉన్నాడు కనుక వారిద్దరిలో ఒకరికి కెప్టెన్సీ రావాలనే ఉద్దేశ్యంతో త్యాగం చేశాడు.

కెప్టెన్ అవ్వడం కోసం నువ్వా నేనా అన్నట్లుగా చాలా సమయం అఖిల్‌ మరియు మెహబూబ్‌ లు చర్చించుకున్నారు.ఒకరి బంతిని మరొకరు మాత్రమే బాస్కెట్‌ లో వేయాలి.

అప్పుడే గేమ్‌ పూర్తి అయ్యి విజేతగా నిలుస్తారు.కాని మెహబూబ్‌ కాని అఖిల్‌ గాని బాల్‌ వేసేందుకు ఆసక్తి చూపలేదు.

ఇద్దరు కూడా వారి వారి బంతినే బాస్కెట్‌ లో వేసుకోవాలని కోరుకున్నారు.చాలా సమయం అదే జరగడంతో బిగ్‌బాస్‌ కు కోపం వచ్చింది.

దానికి తోడు ఎవరి బాల్‌ వారే పట్టుకుని ఉండటంతో బిగ్‌ బాస్‌ నుండి వార్నింగ్‌ వచ్చింది.

టాస్క్‌ పేపర్‌ లో ఎవరి బాల్‌ వారు పట్టుకోవద్దని సూచించినా కూడా ఏమాత్రం గౌరవం లేకుండా బిగ్‌బాస్‌ మాటనే అతిక్రమించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరికి కూడా ఇమ్యూనిటీ కెప్టెన్సీ వద్దనుకున్నారు అంటూ ఈ టాస్క్‌ ను తక్షణమే రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.దాంతో ఈ వారం కెప్టెన్‌ ఎవరు ఉండరు అని అలాగే ఇమ్యూనిటీ కూడా ఎవరికి దక్కలేదు అంటూ ప్రకటించాడు.

ఆ ప్రకటనతో అంతా షాక్‌ అయ్యారు.ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వొచ్చు కదా అంటూ అఖిల్‌ గట్టి గట్టిగా మొత్తుకుంటూ లోనికి వెళ్లాడు.

ఫ్రెండ్‌ తొక్క అంటారు కాని ఎవడు సరిగా లేడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మెహబూబ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇక సోహెల్‌ మీ ఇద్దరికీ వదిలేసి నేను తప్పు చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.మొత్తానికి బిగ్‌బాస్‌ లో నిన్నటి ఎపిసోడ్‌ కూడా రసవత్తరంగా సాగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube