వాళ్లే కాదు బిగ్‌బాస్‌ కూడా ఎంటర్‌టైన్‌ చేయలేక పోయాడు

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ ఈసారి ఆశించిన స్థాయిలో ఎంటర్‌ టైన్‌ చేయలేక పోతుంది.ఆ విషయం రేటింగ్‌ను చూస్తుంటే ఈజీగా అర్థం అవుతుంది.

 Telugu Bigg Boss 4 Latest Diwali Episode Highlights-TeluguStop.com

అత్యంత దారుణమైన రేటింగ్‌ నమోదు అవుతున్న విషయం అందరికి తెలిసిందే.ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా బిగ్‌ బాస్‌ క్రియేటివ్‌ టీమ్‌ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయడంలో విఫలం అవుతున్నారు.

ఆ విషయాన్ని స్వయంగా బిగ్‌ బాస్‌ కూడా ఒప్పుకున్నాడు.

Telugu Bb, Nagarjuna, Telugu-Latest News - Telugu

మీరు గత కొన్ని రోజులుగా ఎంటర్‌ టైన్‌ చేయడం లేదు.ఆ విషయాన్ని మీరు మర్చి పోవడం వల్ల నేడు మిమ్ములను బిగ్‌బాస్‌ ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటున్నాడు అంటూ రివర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్లాన్‌ చేశారు.బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశాడు.

Telugu Bb, Nagarjuna, Telugu-Latest News - Telugu

ఈ రోజు బిగ్‌ బాస్‌ ఇంట్లో నవ్వడం నిషేదం అంటూ ఎంటర్‌టైన్‌ చేసేందుకు ప్రయత్నించారు.కాని ఏ ఒక్కరు కూడా ఎంటర్‌టైన్‌ చేయలేక పోయారు.ఎంటర్‌టైన్‌ చేయడంలో తోపులు అయిన వారు ఇప్పుడు జీరోలు అయ్యారు.ఇక సోహెల్‌ గురించి మరి కొందరి గురించి కూడా బిగ్‌ బాస్‌ ఫన్నీగా కామెంట్‌ లు చేశాడు.

అవి కూడా పెద్దగా నవ్వు తెప్పించలేక పోయాయి.సోహెల్ ను కథ ఎలా ఉంది అంటూ ప్రశ్నించడం కాస్త నవ్వు తెప్పించినా అంతకు మించి అయితే ఎంటర్‌టైన్‌ మెంట్‌ కనిపించలేదు.

Telugu Bb, Nagarjuna, Telugu-Latest News - Telugu

మొత్తానికి బిగ్‌బాస్‌ తెలుగు ప్రేక్షకులకు మరింత దూరం అవుతుందా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.నేడు దీపావళి ఎపిసోడ్‌ సందర్బంగా నాగచైతన్య రాబోతున్నాడు అంటూ ఉన్నారు.వీకెండ్‌ ఎపిసోడ్‌లు సందడి చేస్తున్నాయి.కాని బిగ్‌బాస్‌ వీక్‌ డేస్‌ ఎపిసోడ్‌లు మాత్రం సో సోగానే ఉంటున్నాయి.ముగింపు దశకు వచ్చిన ఈ సమయంలో అయినా బిగ్‌ బాస్‌ ఎంటర్‌ టైన్‌ చేస్తాడా అనేది చూడాలి.వచ్చే వారం నుండి కథ మామూలుగా ఉండదు అంటున్నారు.

మరో నాలుగు వారాలు మాత్రమే బిగ్‌ బాస్‌ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube