బిగ్‌ బాస్‌ : కుమార్‌ సాయికి అదే ప్లస్‌ అవుతుంది  

Reason Behind Kumar Sai Again in Nominations, Kumar Sai, Nominations, Bigg Boss4, Sujataha, Tasks - Telugu Bigg Boss4, Biggboss 4, Kumar Sai, Lasya, Nagarjuna, Nominations, Reason Behind Kumar Sai Again In Nominations, Sujataha, Tasks, Telugu Bigg Boss

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో రెండవ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి అప్పటి నుంచి ఎలిమినేషన్ కి నామినేట్ అవుతూనే ఉన్నాడు.ఆయన సరిగా కలవట్లేదు అని, ఇతరులతో ఆయన మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని ఇంటి సభ్యులు అతడిని నామినేట్ చేస్తూ వస్తున్నారు.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Kumar Sai Nomination Reason

కొత్తగా వచ్చాడు కనుక అతడు నామినేషన్లకు వెళ్లడం ఓకే గాని తర్వాత వారాలు కూడా అతన్ని నామినేషన్ చేయడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇంటి సభ్యులు అంతాకూడా అతడిని నామినేషన్‌ చేస్తున్న కారణంగా ఇప్పటికే అతనికి బయట మద్దతు పెరిగింది.

అతన్ని ఒంటరి చేసి ఆడుతున్నారు అంటూ ఇంటి సభ్యుల పై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి.

TeluguStop.com - బిగ్‌ బాస్‌ : కుమార్‌ సాయికి అదే ప్లస్‌ అవుతుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే అతడి పేరుతో సోషల్ మీడియాలో ఆర్మీ కూడా ఏర్పడింది.

వారి మద్దతుతో ఈ వారం కూడా కుమార్ సాయి కచ్చితంగా సేవ్ అవుతాడు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.అతడిని నామినేషన్ చేస్తున్న వాళ్లు సరైన రీజన్ చెప్పక పోవడంతో పాటు పదేపదే అతడు కలవడం లేదు అని చెప్పడం వల్ల అతడికి ప్లస్‌ అవుతుంది.

కుమార్ సాయి మళ్లీ మళ్లీ సేవ్ అవడం ఖాయం అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ వారంలో కుమార్ సాయిని సుజాత నామినేట్ చేసింది.అందరితో కలవడం లేదు టాస్క్ ల విషయంలో జాగ్రత్తగా ఉండడం లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు.

కుమార్ కూడా ఈసారైనా కాస్త కొత్త రీజన్ చెప్పి ఉంటే బాగుండేది అన్నాడు.

అతడిని సేవ్‌ చేసేందుకు ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు రెడీగా ఉన్నారు కనుక ఈ వారంలో కూడా అతడు సేవ్‌ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.ఈ వారంలో లాస్య, అభిజిత్‌, మెహబూబ్, సయ్యద్ సోహెల్‌, కుమార్ సాయి, హారిక, స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు.

ఈ వారంలో సయ్యద్‌ మరియు మెహబూబ్‌ ల్లో ఒక్కరు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Nominations #Sujataha #Lasya #Kumar Sai #Tasks

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Kumar Sai Nomination Reason Related Telugu News,Photos/Pics,Images..