సమంత కంటిన్యూ అవ్వనుందా? నాగ్‌ రాబోతున్నాడా?  

telugu bigg boss 4 host again nagarjuna not samantha Nagarjuna, Samantha, Big Boss 4, Malanli, Wild Dog Shooting, Marathan Episode, Hyderabad, Samantha Dussara Special BB4 Hosting - Telugu Big Boss 4, Hyderabad, Malanli, Marathan Episode, Nagarjuna, Samantha, Samantha Dussara Special Bb4 Hosting, Telugu Bigg Boss 4 Host Again Nagarjuna Not Samantha, Wild Dog Shooting

తెలుగు బిగ్‌ బాస్‌ గత వారం హోస్టింగ్‌ సమంత చేసింది.మారథాన్‌ ఎపిసోడ్‌ ను మూడు గంటల పాటు నిర్వహించి ఆమె ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Host Again Nagarjuna Not Samantha

సమంత కొత్తగా బాగుందని ఆమె క్యూట్ మాటలతో షోకు మంచి జోష్‌ తీసుకు వచ్చింది అంటూ ప్రశంసలు దక్కించుకుంది.ఇక నాగార్జున మూడు వారాల పాటు మనాలీలోనే ఉండబోతున్నట్లుగా అంతా భావిస్తున్నారు.

మూడు వారాల షూటింగ్‌ అక్కడే ఉంటుందని నాగార్జున వీడియోలో చెప్పాడు.కనుక మరో రెండు సార్లు కూడా సమంత హోస్ట్‌గా వచ్చే అవకాశం ఉందని సమంత అభిమానులు మరియు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

TeluguStop.com - సమంత కంటిన్యూ అవ్వనుందా నాగ్‌ రాబోతున్నాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇలాంటి సమయంలో నాగార్జున గురించిన ఒక వార్త ప్రస్తుతం మీడియాలో వస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రంకు నాగార్జున హైదరాబాద్‌ చేరుకోబోతున్నాడు.

శనివారం రెండు రోజుల షూటింగ్‌ లో పాల్గొని మళ్లీ శనివారం సాయంత్రంకు మనాలీ తిరిగి వెళ్లబోతున్నాడట.గతంలో ఇలా ఎన్నో సందర్బాల్లో జరిగాయి.బిగ్‌ బాస్‌ హోస్టింగ్‌ చేసే ఏ హోస్ట్‌ అయినా షూటింగ్‌లతో బిజీగా ఉన్న సమయంలో ఇలా హడావుడి ప్రయాణాలు పెట్టుకోవడం కామన్‌గా మనం చూస్తూనే ఉంటాం.గత వారంలో కూడా నాగార్జున వచ్చే అవకాశం ఉన్నా కూడా సమంతతో హోస్టింగ్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో నిర్వాహకులు సైతం దసరా స్పెషల్‌గా సమంతతో హోస్టింగ్‌ చేయించారు.

అదే మళ్లీ రిపీట్‌ చేయాలనుకోవడం లేదు.ఒక్క వారం అంటే పర్వాలేదు కాని మళ్లీ మళ్లీ సమంతతో అయితే ప్రేక్షకులు ఆమెకు అలవాటు పడిపోయి నాగార్జున హోస్టింగ్‌కు పెదవి విరిస్తే పరిస్థితి ఏంటీ అనే ఉద్దేశ్యంతోనే నిర్వాహకులు ఇలా నాగార్జుననే మళ్లీ రప్పించే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది.

ఈ వారం సమంత కాకుండా నాగార్జున హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

#TeluguBigg #SamanthaDussara #Nagarjuna #Hyderabad #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Host Again Nagarjuna Not Samantha Related Telugu News,Photos/Pics,Images..