ఇకపై అయినా బిగ్‌బాస్‌ అసలు మజా వచ్చేనా?  

telugu bigg boss 4 going to more interest coming weeks Telugu, Big Boss4, Nagarjuna, Contestents, Big Boss Nomination Process, Big Boss Safe Game - Telugu Big Boss Nomination Process, Big Boss Safe Game, Big Boss4, Contestents, Nagarjuna

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది.ఇప్పటి వరకు కూడా ఇంటి సభ్యులు చాలా సేఫ్‌ గేమ్‌ ఆడుతూ వస్తున్నారు.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Going To More Interest Coming Weeks

ఇకపై ఆ సేఫ్‌ గేమ్స్‌ సాగవు అంటూ నాగార్జున శని ఆదివారాల ఎపిసోడ్స్‌ తో ఫుల్‌ క్లాస్‌ పీకాడు.గత వారం నామినేషన్‌ పక్రియ చాలా లైట్‌ తీసుకున్న ఇంటి సభ్యులకు నేటి నామినేషన్‌ పక్రియ ఎలా ఉంటుందా అంటూ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఖచ్చితంగా నేటి నుండి ఇంటి సభ్యులు తమ మాస్క్‌ లను తీసేసి మరి ఆట ఆడే అవకాశం ఉంది.ఇప్పటి వరకు చూసిన షో వేరు ఇకపై చూడబోతున్న షో వేరు అంటూ చాలా మంది అనుకుంటున్నారు.

TeluguStop.com - ఇకపై అయినా బిగ్‌బాస్‌ అసలు మజా వచ్చేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రతి ఒక్కరు కూడా ఇకపై జెన్యూన్‌గా ఆడుతారని అంతా ఆశిస్తున్నారు.ఇప్పటి వరకు సేఫ్‌ గేమ్‌ ఆడుతూ సింపతీ కొట్టేయాలనుకుంటున్న వారు సింపతితో ఓట్లు రావంటూ నాగార్జున చెప్పడంతో ఇకపై సింపతీ కార్డ్‌ ను ప్రదర్శించే అవకాశం లేదని అనిపిస్తుంది.

ఈవారంలో టాస్క్‌లు మరియు నామినేషన్‌ పక్రియ మరీ దారుణంగా ఉంటుందని ఖచ్చితంగా ప్రేక్షకులు మరియు షో నిర్వాహకులు చెబుతున్నారు.బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గొడవలు ఎంతగా ఉంటే అంతగా ఎక్కువ రేటింగ్‌ వస్తుంది.

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4కు రికార్డు స్తాయి రేటింగ్‌ వచ్చిందని అంటున్నారు.కనుక మరింతగా ఎక్కువ రేటింగ్‌ ను తెప్పించేలా మేకర్స్‌ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మొన్నటి నుండి ఐపీఎల్‌ ప్రారంభం అయ్యింది.కనుక బిగ్‌బాస్‌ను ఎవరు చూస్తారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాని అలాంటిది ఏమీ లేదు.ఖచ్చితంగా బిగ్‌బాస్‌ ను కూడా ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఒక గంట బిగబాస్‌కు కేటాయించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.కనుక ఈ సీజన్‌ లో ఇకపై రచ్చ ఉంటూ మజా వస్తుందని అనిపిస్తుంది.

#Contestents #Big Boss4 #Nagarjuna #BigBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Going To More Interest Coming Weeks Related Telugu News,Photos/Pics,Images..