బిగ్‌బాస్‌ : కన్నీరు పెట్టించిన ఆ ముగ్గురు  

telugu bigg boss 4 episode 40 highlights Harika, Ariyana, Lasya, Big Boss 4, Big Boss 4 Contestents Family Financial Problems - Telugu Ariyana, Bb4, Biggboss, Harika, Lasya, Telugu Biggboss

తెలుగు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ప్రేక్షకులు కన్నీరు పట్టించుకునే సంగతులు జరిగాయి.కంటెస్టెంట్స్ చిన్నప్పటి ముచ్చట్లు మరియు వారి కుటుంబ సభ్యుల ముచ్చట్లతో ఎమోషనల్ గా ఎపిసోడ్ కొనసాగింది.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Episode 40 Highlights

ముఖ్యంగా లాస్య, అరియానా మరియు దేత్తడి హారిక లు చెప్పిన ముచ్చట్లు మరియు వారి కుటుంబ విషయాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి.మొదట అరియానా తన కుటుంబ విషయాల గురించి చెబుతూ తన అమ్మానాన్న చిన్నప్పుడే విడిపోయారు అమ్మ వద్ద నేను పెరిగాను అంది.

నాన్న గురించి ఎక్కువగా తెలియదు అమ్మ ప్రభుత్వ ఉద్యోగి అవ్వడం వల్ల ఆర్థికంగా బాగానే ఉన్నాము, కానీ చాలా సమస్యలు మాత్రం ఎదుర్కోవాల్సి వచ్చింది.

TeluguStop.com - బిగ్‌బాస్‌ : కన్నీరు పెట్టించిన ఆ ముగ్గురు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమ్మనాన్నలు విడిపోవడం వల్ల చిన్నప్పటి నుండి కొన్ని విషయాల్లో సమస్యలు చూశాను ఆ కారణంగానే చదువు పూర్తి చేయలేకపోయాను అంది.

యాంకర్ గా అవకాశం వచ్చినప్పుడు అమ్మ వద్దని అన్నా కూడా నా కాళ్లపై నేను నిలబడాలని ఉద్దేశంతో ఆ నిర్ణయానికి వెళ్లానని చెప్పింది.ఇక లాస్య మాట్లాడుతూ తన పెళ్లి విషయంలో నాన్నను చాలా ఇబ్బంది పెట్టాను.

నాన్న పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నాను.ఇప్పుడు నాన్న మా వారిని కొడుకు అంటాడు.

నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ తొమ్మిది నెలల గర్భంతో గడ్డి కోసేందుకు చేను కి వెళ్ళింది.ఆ సమయంలో నొప్పులు రావడంతో కిలోమీటర్ దూరం నడిచి వచ్చి ఆ తర్వాత నన్ను కన్నది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

తన భర్త విషయంలో కూడా ఏడు సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.ఇప్పుడు చాలా సంతోషంగా ఫ్యామిలీ మొత్తం ఉందని చెప్పింది.

ఎప్పుడు జోవియల్ గా ఉండే హారిక కూడా చాలా బాధలు కడుపులో పెట్టుకుందని నిన్నటి ఎపిసోడ్‌ లో వెల్లడైంది.తన అమ్మా నాన్న విడిపోవడంతో ఆమె చాలా బాధపడినట్లుగా చెప్పింది.

నాన్న అంటే నాకు ఇప్పటికీ ఇష్టం అని కాని ఆయన దూరంగానే ఉన్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.హారిక మామూలుగా అసలు కన్నీరు పెట్టుకోదు.కాని నిన్నటి ఎపిసోడ్ లో కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదిలించింది.మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో ఈ ముగ్గురు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసింది.

ఇతర ఇంటి సభ్యులు కూడా కొందరు వారి కుటుంబ పరిస్థితులను వివరించి కన్నీరు పెట్టుకున్నారు.

#Biggboss #Ariyana #Lasya #Harika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Episode 40 Highlights Related Telugu News,Photos/Pics,Images..