బిగ్‌బాస్‌ : అభిజిత్‌ను ఆవేశంలో బూతులు తిట్టేసిన సోహెల్‌, మెహబూబ్‌  

Telugu Bigg boss 4 episode 18 highlights , Bigg boss 4 episode, Abhijit, Sohail, mahaboob, Robots vs humans, Highlights, Fight, - Telugu Abhijith, Bb4, Divi Biggboss, Lasya, Monal Gajjar, Nagarjuna, Telugu Biggboss

తెలుగు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.మొదటి రెండు వారాల్లో నీరసంగా సాగిన టాస్క్ లతో ప్రేక్షకులు విసుగు చెందారు.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Episode 18 Highlights

కానీ ఈ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అందరినీ ఆకట్టుకుంది.ముఖ్యంగా ఇంటి సభ్యుల్లో ఉన్న పోరాట స్ఫూర్తి మరియు వారిలో ఉన్న తెలివి ఈ టాస్క్ తో బయటపడింది.

ఇంటి సభ్యులు రోబోలు మరియు మనుషులుగా రెండు టీములుగా విడిపోయారు.

TeluguStop.com - బిగ్‌బాస్‌ : అభిజిత్‌ను ఆవేశంలో బూతులు తిట్టేసిన సోహెల్‌, మెహబూబ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రోబోలకు చార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది ఆ చార్జింగ్ ని పెంచుకోవడానికి మనుషుల టీం మెంబర్స్‌ అయిన నోయల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, మెహబూబ్, సోహైల్, దివి మరియు సుజాత లకు కావలసిన అవసరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

అంటే బాత్ రూమ్ కు వెళ్లేందుకు మరియు భోజనం అందుకు గాను వారు రోబోలకు ఛార్జింగ్ ఇస్తారు.కానీ మనుషుల టీం రోబోలకు ఛార్జింగ్ ఇచ్చేందుకు అస్సలు సిద్దపడలేదు.

దాంతో అభిజిత్ మనుషుల టీం మెంబర్ ని కిడ్నాప్ చేసి బలవంతంగా చార్జింగ్ పెట్టుకోవాలని ప్లాన్‌ చేశాడు.మెల్లగా మనుషుల టీం వద్దకు వెళ్ళిన అభిజిత్ దివిని టాయిలెట్ కి వెళ్లాలంటే వెళ్లొచ్చు అంటూ లోనికి తీసుకు వెళ్ళాడు.

ఆ సమయంలో రోబోల టీం లో ఉన్న లేడీస్ అంతా దివిని బలవంతంగా పట్టుకొని ఆమె నుండి చార్జింగ్ తీసుకున్నారు.దివిని రోబోలు పట్టుకున్న సమయంలో డోర్ క్లోజ్ గా ఉండడం తో బయట ఉన్న మనుషుల టీం సభ్యులు లోనికి వెళ్లడానికి సాధ్యపడలేదు.

దాంతో బయట ఉన్న సోహెల్, అఖిల్‌ మరియు మెహబూబ్‌ లు రోబో టీం పై తీవ్ర ఆరోపణలు చేశారు.ముఖ్యంగా మోసం చేసి దివిని లోనికి తీసుకెళ్ళాడు అంటూ అభిజిత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి దూషించారు.

అఖిల్ సోహెల్ మరియు మెహబూబ్ లు అభిజిత్ ని ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని గేమ్ ఆడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో అభిజిత్‌ స్పందిస్తూ నేను చేసింది తప్పు అనిపిస్తే నువ్వు నన్ను నామినేషన్ చేయ్ అంతే తప్ప వ్యక్తిగతం గా దూషించ వద్దంటూ హెచ్చరించాడు.

నిన్నటి ఎపిసోడ్ అంతా కూడా చాలా రసవత్తరంగా సాగింది అదే టాస్క్ నేటి ఎపిసోడ్ లో కూడా కొనసాగుతోంది నేడు కూడా ఇంటి సభ్యులు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు అటాక్ ను ఆసక్తికరంగా చేయబోతున్నారు.మొదటి రెండు వారాలు నిద్రపోయినట్లు గా ఉన్న షో ఈ వారంలో మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Divi Biggboss #Nagarjuna #Abhijith #Lasya #Monal Gajjar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Episode 18 Highlights Related Telugu News,Photos/Pics,Images..