బిగ్‌ బాస్‌ : మోనాల్‌‌ కోసం ఇంకా ఎంత మంది బలి అవ్వాలి?  

telugu bigg boss 4 elimination controversy , bigg boss4, TRP Ratings, Nagarjuna, Elimination Controversy, Monal, Divi, Mehaboob, Votes, Audiance - Telugu Bigg Boss4, Divi, Elimination Controversy, Mehaboob, Monal, Nagarjuna, Samantha, Telugu Bigg Boss 4 Elimination Controversy, Trp Ratings

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కంటెస్టెంట్స్‌ ఎలిమినేషన్‌ పక్రియ ఏమాత్రం జెన్యూన్‌గా లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొదటి రెండు వారాలు పర్వాలేదు కాని మూడవ వారం నుండి కూడా ఎలిమినేషన్‌ ఓట్లు బట్టి జరగడం లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Elimination Controversy

దేవి, స్వాతి దీక్షిత్‌, కుమార్‌ సాయి మరియు దివిలు ఖచ్చితంగా ఓట్ల అనుసారం వెళ్లి పోలేదు అంటున్నారు.దేవి సమయంలో మెహబూబ్‌ కు తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఆయన్ను సేవ్‌ చేసి దేవిని ఎలిమినేట్‌ చేయడం జరిగింది.

ఆ తర్వాత స్వాతి దీక్షిత్‌ వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యింది.ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే ఉద్దేశ్యంతో ఇంటి నుండి ఆమెను బయటకు పంపించడం జరిగింది అనే విమర్శలు వచ్చాయి.

TeluguStop.com - బిగ్‌ బాస్‌ : మోనాల్‌‌ కోసం ఇంకా ఎంత మంది బలి అవ్వాలి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్‌ బాస్‌ నుండి కుమార్‌ సాయి మరియు దివిలు కూడా ఎలిమినేట్‌ అవ్వడంకు కారణం ఓట్లు కాదు అంటున్నారు.వారిద్దరు కూడా మోనాల్‌ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకన్నా కూడా ఆమె వల్ల ఇంట్లో ఉన్న వారితో కాస్త కంటెంట్‌ వస్తుందని, ఫుటేజ్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

కంటెస్టెంట్స్‌ తో కంటెంట్‌ను క్రియేట్‌ చేయడంలో మేకర్స్‌ విఫలం అవుతున్నారు.అందుకే ఉన్న వారిలో ఎవరు అయితే ఫుటేజ్‌ ఇవ్వగలరో వారిని మాత్రమే నిర్వాహకులు ఉంచుతున్నారు. మోనాల్‌ ఉంటే అఖిల్‌ మరియు అభిజిత్‌ లు పులిహోర కలపడం వంటివి చేస్తున్నారు.అందుకే ఆమె వల్ల కాస్త అయినా ప్రయోజనం ఉంది.

ఇటీవల ఎలిమినేట్‌ అయిన దివికి మరియు ఇతర ఇంటి సభ్యులతో పెద్దగా కనెక్షన్ ఏమీ లేదు. అమ్మ రాజశేఖర్‌ తో ఆమె ఎప్పుడు ఉంటుంది.

టాస్క్‌ ల సమయంలో కూడా ఆమె గొడవ పడ్డట్లుగా కూడా పెద్దగా ఎప్పుడు లేదు.అందుకే ఆమె ఉండటం కంటే వెళ్లి పోవడం బెటర్‌ అనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చి ఆమెను సమంత చేత బయటకు పంపించారు.

#Mehaboob #Monal #Nagarjuna #TRP Ratings #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Elimination Controversy Related Telugu News,Photos/Pics,Images..