బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ కరోనా క్వారెంటైన్‌కు రెడీ అయ్యారు  

Bigg Boss4 Contestants to quarantine, Bigg Boss4, Bigg Boss Contestants, Quarantine Centre, Nagarjuna Bigg Boss4, Bigg Boss House - Telugu Bigg Boss Contestants, Bigg Boss House, Bigg Boss4, Bigg Boss4 Contestants To Quarantine, Nagarjuna Bigg Boss4, Quarantine Centre

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఈనెల 30 నుండి ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడో రేపో రావచ్చు అంటున్నారు.

 Telugu Bigg Boss 4 Contestants Quarantine

ఎప్పటిలా కాకుండా ఈసారి పరిస్థితి వేరుగా ఉంది.కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలువలేని పరిస్థితి.

అందుకే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు అనుకుంటున్నారు.హౌస్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ కరోనా క్వారెంటైన్‌కు రెడీ అయ్యారు-Movie-Telugu Tollywood Photo Image

టెస్టుల్లో నెగటివ్‌ వచ్చినా కూడా కొందరు ఆ తర్వాత పాజిటివ్‌ అవుతున్నారు.ఆ ఉద్దేశ్యంతోనే రెండు వారాల క్వారెంటైన్‌కు కంటెస్టెంట్స్‌ను తరలించబోతున్నారు.

క్వారెంటైన్‌ నుండి నేరుగా బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లబోతున్నారు. నాగార్జున హోస్ట్‌గా ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ను తనే స్వయంగా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.కాని ఈసారి అది సాధ్యం కాదు.అసలు నాగార్జునను కంటెస్టెంట్స్‌ కలిసే అవకాశం లేదంటున్నారు.

మొత్తానికి బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెంస్టెంట్స్‌ ఎంట్రీ ఈసారి చాలా విభిన్నంగా విచిత్రంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.కంటెస్టెంట్స్‌ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా రెండు వారాల ముందు నుండి వారిని క్వారెంటైన్‌ చేస్తున్నారు.

ముందు జాగ్రత్తతో అయిదుగురు కంటెస్టెంట్స్‌ను అదనంగా ఎంపిక చేయడం జరిగింది.

కంటెస్టెంట్స్‌ అంతా ఒక్క చోట క్వారెంటైన్‌ కాకుండా ఎవరు ఎక్కడ ఉన్నారు అసలు అనే విషయం కూడా తెలియకుండా క్వారెంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి క్వారంటైన్‌ కేంద్రంలో కూడా బిగ్‌బాస్‌ హౌస్‌ మాదిరిగానే కంటెస్టెంట్స్‌ ఫీల్‌ కావాల్సి ఉంటుంది.ఈసారి సీజన్‌ ఎక్కువ రోజులు ఉంటుందా తక్కువ రోజులు ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.

#NagarjunaBigg #Bigg Boss4 #Bigg Boss House #BiggBoss #BiggBoss4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Contestants Quarantine Related Telugu News,Photos/Pics,Images..