గంగవ్వ ఉంది.. బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్స్‌ వీళ్లే

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం అయ్యింది.గత రెండు నెలలుగా ఊరిస్తున్న సీజన్‌ 4 కు తెర లేచింది.

 Telugu Bigg Boss 4 Contestant List, Bigg Boss 4 ,social Media, Gangavva, Nagarju-TeluguStop.com

పలువురు కంటెస్టెంట్స్‌ పేర్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నాయి.అందులో కొందరు ఉన్నారు మరికొందరు లేరు.

అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన గంగవ్వ షో లో ఉంది.మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పరిచయం అయిన గంగవ్వ అనూహ్యంగా స్టార్‌డం దక్కించుకుంది.

అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ను కలిగి ఉన్న గంగవ్వ బిగ్‌ బాస్‌ లో ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ రచ్చగా ఉంది.

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ వారు అంతా కూడా గంగవ్వకు సపోర్ట్‌ గా నిలవడం ఖాయం.

ఇప్పటికే సోషల్‌ మీడియాలో గంగవ్వ పేరు మారుమ్రోగుతోంది.తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే కాకుండా అన్ని భాషల బిగ్‌బాస్‌ చరిత్రలో కూడా గంగవ్వ ఎంట్రీ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది.

నాగార్జున అన్నట్లుగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా బిగ్‌బాస్‌ కు గంగవ్వ స్పెషల్‌ అన్నాడు.షో లో 16వ కంటెస్టెంట్‌గా ఎంటర్‌ అయిన గంగవ్వను ఇంటి సభ్యులకు పరిచయం చేస్తూ మీరు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఆమెను మీరు ఏమైనా అన్నారంటే మీరు ఖచ్చితంగా ట్రబుల్స్‌ లో పడ్డట్లే అంటూ హెచ్చరించాడు అంటే షో నిర్వాహకులు కూడా గంగవ్వ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ సీజన్‌ లో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయబోతున్న 16 మంది కంటెస్టెంట్స్‌ వీళ్లే.1.మోనాల్‌ గజ్జర్‌, 2.సూర్య కిరణ్‌, 3.లాస్య, 4.అభిజిత్‌, 5.సుజాత, 6.దిల్‌సే మెహబూబ్‌, 7.దేవి, 8.హారిక, 9.సోహెల్‌, 10.అరియానా గ్లోరి, 11.అమ్మరాజశేఖర్‌, 12.కరాటే కళ్యాణీ, 13.నోయల్‌, 14.దివి, 15.అఖిల్‌ సర్తక్‌, 16.గంగవ్వ.

నేటి నుండి బిగ్ బాస్ రచ్చ షురూ కాబోతుంది.

స్టార్ మా కు రేటింగ్ తో పంట ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube