అమ్మ రాజశేఖర్‌ తో మాత్రమే కనెక్ట్‌ అవ్వడానికి కారణం చెప్పిన దివి  

telugu bigg boss contestant divi interview Telugu Big Boss 4, Diwi, Amma Rajashekar, Dussara Special Episode, Samantha - Telugu Bb4, Bb4 Divi, Bigg Boss Divi, Divi, Telugu Bigg Boss 4, Telugu Bigg Boss Contestant Divi Interview, Telugu Film News

తెలుగు బిగ్‌బాస్ నుండి మొన్న ఆదివారం దివి ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే.సమంత హోస్టింగ్ చేసిన దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌లో దివి ఎలిమినేట్ అవ్వడం ఆమె అభిమానులకు మరియు బిగ్‌బాస్‌ అభిమానులకు కూడా నిరాశ కలిగించింది.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Contestant Divi Interview

దసరా పండుగ రోజు అంతా సందడిగా ఉన్న సమయంలో ఆమెను ఎలిమినేట్‌ చేయడం వల్ల ఇంటి సభ్యులు కూడా నిరాశ వ్యక్తం చేశారు.ఎలిమినేట్‌ అయిన దివి ఆ తర్వాత ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట ఇంత ఫాలోయింగ్‌ తనకు క్రియేట్‌ అయ్యిందనే విషయం నాకు తెలియదు.

నటిగా నేను ఇప్పటి వరకు చాలానే చేశాను.కాని బిగ్ బాస్ అనేది నాకు జీవితంలో మంచి అవకాశం అంటూ దివి పేర్కొంది.

TeluguStop.com - అమ్మ రాజశేఖర్‌ తో మాత్రమే కనెక్ట్‌ అవ్వడానికి కారణం చెప్పిన దివి-General-Telugu-Telugu Tollywood Photo Image

బిగ్‌బాస్‌ హౌస్‌లో దివి కేవలం అమ్మ రాజశేఖర్‌తోనే ఆట ఆడినట్లుగా అనిపించింది.వారిద్దరు ఎక్కువగా కలిసి ఉన్నారు.అందుకే వారిద్దరిని ప్రేక్షకులు పంపించే ఉద్దేశ్యంతో ఆమెను ఎలిమినేట్‌ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది.ఆ విషయంలో మీరు ఏమంటారు అంటూ దివిని ప్రశ్నించగా అందుకు ఆమె సమాధానం చెబుతూ నేను వెంటనే ఎవరితో కలవలేను.

కొన్ని కారణాల వల్ల వెంటనే అమ్మ గారితో కలిశాను.ఆయన నాపట్ల చూపించిన కేరింగ్‌ విషయంకు నేను ఫిదా అయ్యాను.

అందుకే ఎక్కువగా ఆయనతో ఉన్న మాట వాస్తవం అంటూ దివి చెప్పుకొచ్చింది.నాకు సినిమాలో ఆఫర్లు వస్తాయని వెయిట్ చేస్తున్నాను.

సమంత గారి హోస్టింగ్‌లో సెండాఫ్‌ తీసుకోవడం బాగానే అనిపించింది.కాని ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది.

మొత్తానికి బిగ్ బాస్ అనేది లైఫ్‌ టైమ్‌ మెమోరీ అంటూ చెప్పుకొచ్చింది.ఇక మోనాల్‌ విషయంలో క్లారిటీ లేదంటూ వ్యాఖ్యలు చేసిన దివి.

అభిజిత్‌కు కాస్త ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అంటూ వ్యాఖ్యలు చేసింది.

#Bigg Boss Divi #Divi #TeluguBigg #Bb4 Divi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Contestant Divi Interview Related Telugu News,Photos/Pics,Images..