బిగ్‌ బాస్‌ 3 పార్టిసిపెంట్స్‌ వీరే... నీ బొందరేయ్‌ నీ బొంద  

Telugu Bigg Boss 3 Contestants List-raghu Master,resai,shobhitha,singer Hema Chandra,telugu Bigg Boss 3,venkatesh Host

తెలుగులో బిగ్‌ బాస్‌ రెండు సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌ ఎన్టీఆర్‌ వల్ల సూపర్‌ హిట్‌ అవ్వగా, రెండవ సీజన్‌ కౌశల్‌ ఆర్మీ కారణంగా మంచి టీఆర్పీరేటింగ్‌ను దక్కించుకుంది. రెండవ సీజన్‌ టీఆర్పీ రేటింగ్‌ను అయితే దక్కించుకుంది, కాని విజయం దక్కించుకున్నట్లుగా మాత్రం ఎవరు భావించడం లేదు..

బిగ్‌ బాస్‌ 3 పార్టిసిపెంట్స్‌ వీరే... నీ బొందరేయ్‌ నీ బొంద-Telugu Bigg Boss 3 Contestants List

రెండవ సీజన్‌లో పలు తప్పులు దొర్లాయి.

ఎలిమినేట్‌ అయిన వారు మళ్లీ లోనికి వెళ్లడం, నూతన్‌ నాయుడు మళ్లీ మళ్లీ బయటకు లోనికి వెళ్లడం వంటివి జరిగిన నేపథ్యంలో రెండవ సీజన్‌తో పాటు బిగ్‌బాస్‌పైనే ప్రేక్షకులకు ఆసక్తి పోయింది. అయినా కూడా మూడవ సీజన్‌కు బిగ్‌బాస్‌ సిద్దం అవుతుందనే వార్తలు వస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌ ఎవరా అంటూ చర్చలు జరుగుతున్నాయి. వెంకటేష్‌, చిరంజీవి, నాగార్జున ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే పార్టిసిపెంట్స్‌ కూడా ఎంపిక అయ్యారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఉంటుందో లేదో వెళ్లడి కాలేదు కాని, ఎవరికి తోచిన విధంగా వారు పార్టిసిపెంట్లను విశ్లేషిస్తున్నాడు.

సోషల్‌ మీడియాలో ఒకడు బిగ్‌బాస్‌ 3 పార్టిసిపెంట్స్‌ ఇదుగో అంటూ ఈ జాబితాను పోస్ట్‌ చేశాడు. ఆ జాబితాలో ముందుగా రేణుదేశాయ్‌ పేరు ఉంది..

అసలు రేణు దేశాయ్‌ బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3లో ఎలా పాల్గొంటుందా, నీకు ఈ ఆలోచన ఎలా కలిగిందిరా, నీ బొందరా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నాడు.

అతడు పెట్టిన జాబితాలో రేణుదేశాయ్‌తో పాటు ఇంకా ఉదయ భాను, శోభిత, గద్దె సిందూర, వరుణ్‌ సందేశ్‌, కమల్‌ కామరాజు, రఘు మాస్టర్‌, పొట్టి నరేష్‌, యూట్యూబ్‌ స్టార్‌ జాహ్నవి, సింగర్‌ హేమచంద్రు ఉన్నారు. అతడు ఎలా ఊహించాడో కాని వీరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ టీం నుండి కాల్‌ కాని, మెసేజ్‌ కాని అందుకోలేదట. అతడు చెబుతున్నవని కూడా పుకార్లే. ఇలాంటి పుకార్లు ముందు ముందు మరెన్ని వినాల్సి ఉంటుందో.