బిగ్‌బాస్‌ : మొదటి రోజే హౌస్‌మేట్స్‌ మద్య చిచ్చు పెట్టారుగా  

Telugu Big Boss Nominations Start-hema In Monitor,jyothi,nagarjuna,nominations,ravi Krishna,telugu Big Boss

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం అయ్యింది. ఆదివారం ఇంటి సభ్యుల పరిచయం మరియు లోనికి పంపించడం జరిగింది. ఇక సోమ వారం నుండి అసలు షో ప్రారంభం అయ్యింది. నిన్న అంటే సోమవారం రాత్రి మొదటి ఎపిసోడ్‌ జరిగింది..

బిగ్‌బాస్‌ : మొదటి రోజే హౌస్‌మేట్స్‌ మద్య చిచ్చు పెట్టారుగా-Telugu Big Boss Nominations Start

బిగ్‌బాస్‌ ఇంట్లో వెళ్లిన 15 మంది ఇంకా కుదురుకోకుండానే వారి మద్య గొడవలు పెట్టి కూర్చున్నారు. బిగ్‌బాస్‌ మొదటి వారం ఎలిమినేషన్‌ నామినేషన్‌ను అత్యంత నాటకీయ పరిణామల మద్య చేయడం జరిగింది.

సీజన్‌ 3 మొదటి రోజే ఇంట్లో వేడి వాతావరణం ఏర్పడింది. ఇంట్లోకి వెళ్లిన మొదటి ముగ్గురు అయిన జ్యోతి, అషు, రవికృష్ణలు మిగిలిన 12 మందిని కొన్ని ప్రశ్నలు అడిగి ఆ సమాధానాల ఆధారంగా ఆరుగురిని నామినేట్‌ చేయడం జరిగింది. ఆ ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. అయితే వారు ఆ ఆరుగురికి కూడా బిగ్‌బాస్‌ ఒక అవకాశం ఇచ్చారు.

తమ స్థానంలో ఇతరులు ఎవరైనా నామినేట్‌ అయ్యేందుకు అర్హులు అంటే వారి పేర్లు చెప్పి మానిటర్‌ వద్ద మెప్పు పొందాల్సి ఉంటుంది. .

ఈ మొత్తం వ్యవహారం మానిటర్‌గా హేమ వ్యవహరిస్తుంది. మొదటి ఎపిసోడ్‌లోనే ఇంటి సభ్యుల మద్య గొడవలు పెట్టి అందరిలో ఆసక్తిని పెంచాడు. ఇక రెండవ రోజు అయిన నేడు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం తాను గొప్ప నేను ఉండాలి, వారికి ఉండే అర్హత లేదు అంటూ చెప్పబోతున్నారు.

మొత్తానికి నేడు మరింత రసవత్తరంగా బిగ్‌బాస్‌ సాగబోతుందని అనిపిస్తుంది.