బిగ్‌బాస్‌ 3 రేటింగ్‌ మరీ దారుణంగా ఉంది, కార్తీక దీపంలో సగం కూడా రావడం లేదట

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి విపరీతమైన రేటింగ్‌ వచ్చిందని మొదటి వారం చంకలు కొట్టుకున్న స్టార్‌ మాటీవీకి రెండవ వారం నుండి చుక్కలు కనిపిస్తున్నాయి.మొదటి వారంలో తెలుగు బుల్లి తెర చరిత్రలోనే రికార్డు సృష్టించగా రెండవ వారం నుండి తగ్గుతూ వస్తుంది.మరీ దారుణంగా గత వారంలో కేవలం 8.09 టీవీఆర్‌ మాత్రమే వచ్చింది.ఇదే సమయంలో అదే స్టార్‌ మాటీవీలో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్‌కు టీవీఆర్‌ ఏకంగా 16.97 టీవీఆర్‌ వచ్చింది.

 Telugu Big Boss Trp Rating Down Comparison Karthika Deepam-TeluguStop.com
బిగ్‌బాస్‌ 3 రేటింగ్‌ మరీ దారు

అర్థగంట సమయం ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్‌ను రికార్డు స్థాయిలో తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు.కాని బిగ్‌బాస్‌ను మాత్రం ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.రోజు రోజుకు బిగ్‌బాస్‌ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.ఎందుకంటే షో లో గొడవలు లేవు, కొత్త ఎలిమెంట్స్‌ లేవు.ఆసక్తికరంగా టాస్క్‌లు లేవు.ఆ కారణంగానే బిగ్‌బాస్‌ను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారనే వాదన వినిపిస్తుంది.

బిగ్‌బాస్‌ 3 రేటింగ్‌ మరీ దారు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఆచి తూచి ఎంపిక చేయడం జరిగింది.ఈ సారి చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కపుల్‌ను పంపించడం జరిగింది.వారిద్దరు సరదాలు, గొడవలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిస్తారని అంతా భావించారు.కాని అనూహ్యంగా అది వర్కౌట్‌ అవ్వలేదు.ఇక ట్రాన్స్‌ జెండర్‌ను తీసుకు వచ్చి ఇంట్లో పెట్టారు.తమన్నా సింహాద్రీ చేసిన రచ్చ వల్ల షోకు సగం క్రేజ్‌ తగ్గింది.

ఇలా బిగ్‌బాస్‌ సీజన్‌ 3 దారుణమైన ఫలితాలను ఎదుర్కొంటుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అషు రెడ్డిని ఎలిమినేట్‌ చేయడం జరిగింది.

హౌస్‌లో ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.ఒక గొడవలు పెట్టుకోదు, ఒక టాస్క్‌ సరిగా చేయద్దు.

ఆ కారణంగానే ఆమెను ఎలిమినేట్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.అత్యంత వివాదాస్పదంగా పేర్కొంటున్న ఒక్క విషయం కూడా ఇంట్లో జరగడం లేదు.

ముందు ముందు ఇలాగే ఉంటే కష్టమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube