బిగ్‌బాస్‌3 లో ముగ్గురు హాట్‌ ముద్దుగుమ్మలు... రచ్చ రచ్చ ఉంటుందేమో  

Telugu Big Boss Three Updates-gutta Jwala,kaushal,sri Mukhi,udhaya Bhanu,నాగార్జున,బిగ్‌బాస్‌3

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి రెండు సీజన్‌లు మంచి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. రెండవ సీజన్‌లో పార్టిసిపెంట్స్‌ ఎంపికపై విమర్శలు వచ్చినా కూడా కౌశల్‌ వివాదం ఇంకా ఇతరత్ర కారణాల వల్ల మంచి రేటింగ్‌ను దక్కించుకోవడంతో పాటు లాభాలను తెచ్చి పెట్టింది. ఇప్పుడు మూడవ సీజన్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి..

బిగ్‌బాస్‌3 లో ముగ్గురు హాట్‌ ముద్దుగుమ్మలు... రచ్చ రచ్చ ఉంటుందేమో-Telugu Big Boss Three Updates

గత నాలుగు అయిదు నెలలుగా బిగ్‌బాస్‌ గురించిన వార్తలు మీడియాలో ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లు పార్టిసిపెంట్స్‌ గురించి, కొన్నాళ్లు హోస్ట్‌ గురించి ఇష్టం వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు తుది అంకంకు చేరుకున్నట్లుగా అనిపిస్తుంది.

బిగ్‌బాస్‌కు ఇప్పటికే నాగార్జున హోస్ట్‌ అంటూ తేలిపోయింది. ఆ విషయమై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని త్వరలోనే ఆ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్‌కు సంబంధించిన పార్టిసిపెంట్స్‌ గురించిన చర్చలు జరుగుతున్నాయి.

గత కొన్ని నెలలుగా ఉదయభాను బిగ్‌బాస్‌కు వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు ఇప్పుడు శ్రీముఖి మరియు గుత్తా జ్వాలలు కూడా బిగ్‌బాస్‌లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే పటాస్‌కు బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన శ్రీముఖి బిగ్‌బాస్‌లోకి వెళ్లడం కన్ఫర్మ్‌ అయ్యింది. ఇక తాజాగా గుత్తా జ్వాలా కూడా బిగ్‌బాస్‌ నిర్వాహకులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

ఆమె గత కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంటుంది. బ్యాడ్మింటన్‌తో పాటు తన గ్లామర్‌తో జనాల్లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న గుత్తా జ్వాలా బిగ్‌బాస్‌లో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న ఈ ముగ్గురు లేడీస్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది..