బిగ్‌బాస్‌ వార్తలన్నింటికి ఆయన క్లారిటీ ఇచ్చేశాడు  

Telugu Big Boss Season 4 News Latest Update, Big Boss Season 4, Star Maa, Serials Shootings, Social Media, Big Boss 4 Producers, Lock Down, Coronavirus, - Telugu Big Boss 4 Producers, Big Boss Season 4, Coronavirus, Lock Down, Serials Shootings, Social Media, Star Maa

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం కాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే హోస్ట్‌ విషయమై చర్చ జరిగింది.

 Telugu Big Boss Season 4 Star Maa

కంటెస్టెంట్స్‌ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి.వారు ఎంపిక అయ్యారు, వీరు ఎంపిక కాలేదు, వారితో చర్చలు జరుగుతున్నాయి అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి సమయంలో స్టార్‌ మాటీవీకి చెందిన ఒక వ్యక్తి అనధికారికంగా మీడియా సన్నిహితులతో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ వార్తలన్నీ కూడా పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

బిగ్‌బాస్‌ వార్తలన్నింటికి ఆయన క్లారిటీ ఇచ్చేశాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రముఖ స్టార్స్‌ ఎంపిక అయ్యారంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ప్రస్తుతం బిగ్‌బాస్‌ గురించి ఎలాంటి చర్చలు జరగడం లేదు.

అసలు ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొన్నాడు.ప్రస్తుతం షూటింగ్స్‌ జరిపే పరిస్థితి కనిపించడం లేదు.సీరియల్స్‌ షూటింగ్స్‌ చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది.ఇలాంటి సమయంలో బిగ్‌బాస్‌ షూటింగ్‌ అంటే సాధ్యం అయ్యే పరిస్థితి కాదు.

ఇవన్నీ ఎవరో కొందరు కావాలని క్రియేట్‌ చేస్తున్న పుకార్లంటూ ఆయన పేర్కొన్నాడు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఈసారి ఉంటుందా లేదా అనేది ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు.కాని ప్రస్తుతానికి చర్చలు మాత్రం జరగడం లేదంటూ ఆయన పేర్కొన్నాడు.కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇండియాలోని ఏ భాషలో కూడా బిగ్‌బాస్‌ ప్రసారం అయ్యే అవకాశం లేదని అన్నాడు.

ఈ ఏడాది చివరి వరకు ఒక వేళ అంతా ప్రశాంతంగా ఉంటే తెలుగు మరియు తమిళం ఒకేసారి ప్రారంభించే యోచనలో బిగ్‌బాస్‌ నిర్మాతలు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

#Social Media #Lock Down #Star Maa #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Big Boss Season 4 Star Maa Related Telugu News,Photos/Pics,Images..