పాపం ... అరియనా పాప తన కెరియర్ కోసం అన్ని కష్టాలు పడిందట

తెలుగులో ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న యాంకర్ “అరియనా గ్లోరీ” తన అద్భుత నటన తీరుతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.అయితే ఇప్పటికే అరియనా గ్లోరీ ఆటతీరు నచ్చినటువంటి దేవి నాగవల్లి ఆమెను ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసింది.

 Telugu Big Boss Season 4 Contestant Ariyana Glory Facing Struggles News, Ariyana-TeluguStop.com

 అయితే అరియనా గ్లోరీ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనక ముందు పాల్గొన్నటువంటి ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే అరియనా గ్లోరీ సినీ పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న పలు సంఘటనలు గురించి తెలిపింది.

 ఇందులో ముఖ్యంగా తాను నటి కావాలని తన ఇంట్లో వాళ్లతో చెప్పకుండా హైదరాబాద్ కి వచ్చేసానని దాంతో మొదట్లో 7000 రూపాయల జీతానికి ఓ చిన్న కంపెనీ లో పని చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ క్రమంలో తన జీతం డబ్బులు సిటీలో బ్రతకడానికి సరిపోకపోవడంతో అప్పుడప్పుడు శుభకార్యాలలో యాంకరింగ్ నిర్వహించేదాన్నని దాంతో డబ్బులు కొంతమేర బాగానే వచ్చాయని ఆ విధంగా కొద్ది రోజులు కష్టాలు పడిన తర్వాత అవకాశాలు బాగానే వస్తున్నాయని చెప్పుకొచ్చింది.

అయితే ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్ను బికినీలో చూడాలని ఉందంటూ చేసినటువంటి కామెంట్లని తాను కాంప్లిమెంట్స్ గా తీసుకున్నానని అందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అంతేగాక ఆయన ఆ సమయంలో సినిమా అవకాశం ఇస్తానని చెప్పాడు తప్ప పర్సనల్ గా ఉద్దేశించి ఎలాంటి కామెంట్ చేయలేదని కూడా తనకు తెలిపారని చెప్పుకొచ్చింది.

ఒక రకంగా చెప్పాలంటే ఆ విషయం వల్ల అప్పట్లో తనకు బాగానే ఫేమ్ వచ్చిందని కూడా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube