బిగ్‌బాస్‌ లీక్‌ : నేడు ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే  

Telugu Big Boss Latest Update About Kumar Sai Elimination, Big Boss 4, Kumar Sai, Wild Card Entry, Nagarjuna, Star Maa, Telugu Big Boss 4 Leaks - Telugu Big Boss 4, Kumar Sai, Nagarjuna, Star Maa, Telugu Big Boss 4 Leaks, Wild Card Entry

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఆరవ వారం ముగిసింది.నేడు ఆరవ వారంలో ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వారిలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే ఎపిసోడ్‌ ప్రసారం కాబోతుంది.

TeluguStop.com - Telugu Big Boss Latest Update About Kumar Sai Elimination

అయితే నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ కు సంబంధించి నిన్ననే షూటింగ్‌ జరిగింది.కనుక ఎలిమినేట్‌ ఎవరు అయ్యారు అనేది ఇప్పటికే స్టార్‌ మా వర్గాల నుండి క్లారిటీ వచ్చేసింది.

కుమార్‌ సాయి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యాడు.ఆయన ఇప్పటికే హౌస్‌ నుండి బయటకు వచ్చేశాడు.

TeluguStop.com - బిగ్‌బాస్‌ లీక్‌ : నేడు ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా లోనికి వెళ్లిన కుమార్‌ సాయి మొదటి నుండి కొందరు ఇంటి సభ్యులకు దగ్గర అవ్వలేక పోయాడు.అతడు లేట్‌ గా రావడంతో పాటు కొందరికి అతడు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

కనుక అతడు ఎక్కువగా ఒంటరిగా ఉండటం, గేమ్‌ లో సరిగా ఆడలేక పోవడం వంటి కారణాల వల్ల ప్రేక్షకులు కుమార్‌ సాయిని ఎలిమినేట్‌ చేశారు.

మొదటి వారం పూర్తి అయిన వెంటనే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో లోనికి వచ్చిన కుమార్‌ సాయి అప్పటి నుండి ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అవుతూనే ఉన్నాడు.

మద్యలో ఒక వారం కెప్టెన్‌ అవ్వడం వల్ల నామినేట్‌ అవ్వలేదు.మొత్తం నాలుగు వారాలు ఎలిమినేట్‌ అయిన కుమార్‌ సాయి ఈ సారి సేవ్‌ అవ్వలేక పోయాడు.

మొదటి మూడు వారాల పాటు సేవ్‌ అయిన కుమార్‌ సాయి ఈసారి మాత్రం ప్రేక్షకులు కనికరించక పోవడంతో బయట పడ్డాడు.అతడి తీరు వల్లే అతడు నామినేట్‌ అవ్వడం మరియు ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది.

ఈ విషయాన్ని నేడు అధికారికంగా నాగార్జున ఎపిసోడ్‌ లో ప్రకటించబోతున్నారు.సీజన్‌ ఆరంభం నుండి లీక్‌ అయిన విషయాలు నిజమే అయ్యాయి.

కనుక కుమార్‌ సాయి విషయం కూడా నిజం అయ్యి ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు.మరికొన్ని గంటల్లో ఈ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#TeluguBig #Kumar Sai #Big Boss 4 #Nagarjuna #Star Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Big Boss Latest Update About Kumar Sai Elimination Related Telugu News,Photos/Pics,Images..