కొత్త ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ... 

తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నటిగా పరిచయమైన పాల బుగ్గల సుందరి దీక్షా పంత్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దీక్షా పంత్ కి హీరోయిన్ కావాల్సినటువంటి లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ సరైన అవకాశం రాకపోవడంతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

 Telugu Big Boss Fame Diksha Panth Purchased New Home-TeluguStop.com

కానీ ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే పాపులర్ అయింది.దీంతో ఈ అమ్మడికి కొంతమేర పలు ప్రైవేట్ ఆల్బమ్స్, అలాగే పలు చిత్రాలలో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది.

అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేటువంటి దీక్షా పంత్ తాజాగా తనకు సంబంధించిన మరో అప్ డేట్ ని ప్రేక్షకులతో పంచుకుంది.ఇందులో తను ఇటీవలే కొత్త ఇల్లు కొన్నానని అలాగే గృహ ప్రవేశం చేసిన సమయంలో తీసిన ఫోటోలను కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

 Telugu Big Boss Fame Diksha Panth Purchased New Home-కొత్త ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా గడిచిన కొన్ని సంవత్సరాలలో తనకి తన కష్టంపై నమ్మకం ఏర్పడిందని అంతేకాకుండా తన సొంతింటి కల నిజం చేసుకునేందుకు చాలా కష్టపడ్డానని అందుకుగాను తనకు చాలా గర్వంగా ఉందని క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో కొందరు అభిమానులు మరియు ఆమె స్నేహితులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Telugu Big Boss Fame Diskha Panth, Diksha Panth, Diksha Panth New Home Inauguration News, Telugu Actress, Telugu Big Boss Fame Diksha Panth Purchased New Home-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా దీక్షా పంత్ తెలుగులో దాదాపుగా పదికి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.అంతేకాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించింది.కాగా ప్రస్తుతం మాయా మాల్, హార్మోన్స్, తొండి, తదితర తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “ఐయామ్” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.

#Diksha Panth #TeluguBig #DikshaPanth #BigBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు