బిగ్‌ బాస్‌ ను 'హాఫ్'‌ చేసేందుకు చర్చలు

తెలుగు మరియు తమిళ బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది.ఈ ఏడాది సీజన్‌ ఉండక పోవచ్చు అనుకుంటూ ఉండగా చర్చలు ప్రారంభం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Latest Update Telugu Big Boss Season 4 About Now Big Boss Runnning 60 To 70 Days-TeluguStop.com

తెలుగు మరియు తమిళ బిగ్‌బాస్‌లకు మంచి డిమాండ్‌ ఉండటం వల్ల మిస్‌ చేయవద్దనే ఉద్దేశ్యంతో సీజన్స్‌ను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ప్రారంభించాలనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులు బాగాలేని కారణంగా షోను ముందస్తుగా ముగించే ఉద్దేశ్యంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ ను 60 నుండి 70 రోజులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.ఒక వేళ పరిస్థితులు అనుకూలించి షో మద్యలో ఉన్న సమయంలో ఏమైనా వ్యాక్సిన్‌ వస్తే మాత్రం దాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

కంటెస్టెంట్స్‌తో మొత్తం 130 రోజులకు అగ్రిమెంట్‌ తీసుకుని వారిని రంగంలోకి దించుతారు.

Telugu Big Boss, Jhansi, Nagarjuna, Sunitha, Telugutamilam, Telugu Big Boss-

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి హోస్ట్‌గా చేసిన నాగార్జున నాల్గవ సీజన్‌కు హోస్టింగ్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ బిగ్‌బాస్‌ లో కంటెస్టెంట్స్‌ ఎవరు అనే చర్చ అప్పుడే జరుగుతోంది.యాంకర్‌ జాన్సీ సింగర్‌ సునీతలకు అప్పుడే ఎంట్రీ పాస్‌ దక్కిందనే చర్చ జరుగుతోంది.

మొత్తానికి తెలుగు బిగ్‌బాస్‌ వచ్చే అక్టోబర్‌లో మొదలు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.అది ఎలా ఉంటుంది అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube