బిగ్ బాస్ లోకి మరో తెలంగాణ పిల్ల ఎంట్రీ.. ఎవరంటే?  

mangli will enter in telugu bigg boss season 4 Telugu Big Boss 4, Mangli, Singer, 16 Members , Gangavva, Star Maa, Mangali Huge Remmunaration, Mangli Wild Card Entry, Avinash, Kumar Sai, Swathi Dixith - Telugu Avinash, Gangavva, Kumar Sai, Mangali Huge Remmunaration, Mangli, Mangli Wild Card Entry, Mangli Will Enter In Telugu Bigg Boss Season 4, Star Maa, Swathi Dixith, Telugu Big Boss 4

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.మొదట కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా తర్వాత జబర్దస్త్ అవినాష్, జంప్ జిలానీ ఫేమ్ స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

TeluguStop.com - Telugu Big Boss 4 Mangli Singer

వీళ్లలో ఇప్పటికే కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కాగా అవినాష్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు.సీజన్ 4లో కంటెస్టెంట్ల ఎంపికతో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంపిక కూడా సరిగ్గా లేదని కామెంట్లు వినిపించాయి.

బిగ్ బాస్ హౌస్ లోకి 16 మంది కంటెస్టెంట్లు, ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మొత్తం 19 మంది రాగా వీరిలో ఏడుగురు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు.మరోవైపు బిగ్ బాస్ షో రేటింగులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

TeluguStop.com - బిగ్ బాస్ లోకి మరో తెలంగాణ పిల్ల ఎంట్రీ.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.జానపద గాయని, యాంకర్ మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది.

మంగ్లీ ఎంట్రీ ద్వారా ప్రేక్షకుల్లో షోపై ఆసక్తి పెంచుదామని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది.బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ లో చివరివరకు ఉంటుందని భావించిన గంగవ్వ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో మంగ్లీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

అయితే మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు అడుగు పెడుతుంది.? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.మంగ్లీకి భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభానికి ముందే మంగ్లీ ఈ సీజన్ లో పాల్గొంటున్నట్టు వార్తలు రాగా ఆ వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి.

జానపద గేయాలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ బిగ్ బాస్ షోకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.

#MangliWild #Star Maa #Mangli #Kumar Sai #MangliWill

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Big Boss 4 Mangli Singer Related Telugu News,Photos/Pics,Images..