బిగ్‌బాస్‌ : రాహుల్‌కి పునర్నవి నమ్మక ద్రోహం

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పదవ వారం ఎలిమినేషన్‌ పక్రియ రెండు రోజుల పాటు సాగింది.మొదటి రోజు కొంత మంది సేవ్‌ అయ్యి మహేష్‌ విట్టాను నామినేట్‌ చేయగా, రెండవ రోజు రాహుల్‌ కోసం పునర్నవి సీజన్‌ మొత్తం సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకునేందుకు ఒప్పుకోక పోవడంతో రాహుల్‌ ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యాడు.

 Telugu Big Boss 3 Punarnavi And Rahullatest Update-TeluguStop.com

ఇక కెప్టెన్‌ వితిక తన ప్రత్యేక అథికారాలు ఉపయోగించి హిమజను నామినేట్‌ చేయడం చేయడం జరిగింది.దాంతో ఈ వారంలో మొత్తం ముగ్గురు మాత్రమే ఎలిమినేషన్స్‌కు నామినేట్‌ అవ్వడం జరిగింది.

Telugu Himaja, Mahesh Vitta, Punarnavi, Rahul, Rahulglass, Telugubig-

  మహేష్‌ విట్టా, రాహుల్‌, హిమజల్లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే ఆసక్తికర ప్రచారం అయితే మొదలైంది.ఇదే సమయంలో పునర్నవి చేసిన పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.పునర్నవి సేవ్‌ అవ్వడం కోసం రాహుల్‌ ఏకంగా 20 గ్లాస్ల కాకరకాయ జ్యూస్‌ తాగాడు.వాంతులు చేసుకుంటూ మరీ ఆమె కోసం కష్టపడ్డాడు.20 గ్లాసల వాటర్‌ తాగడమే చాలా కష్టం.అలాంటిది 20 గ్లాస్‌ల కాకర జ్యూస్‌ తాగాడు.

అంతటి సాహసం చేసిన రాహుల్‌ కోసం పునర్నవి సీజన్‌ మొత్తం నామినేట్‌ అయ్యేందుకు ఒప్పుకోలేదు.

Telugu Himaja, Mahesh Vitta, Punarnavi, Rahul, Rahulglass, Telugubig-

  పునర్నవికి మంచి క్రేజ్‌ అయితే ఉంది.ఆమె ఎలిమినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా సేవ్‌ అవుతూ వచ్చింది.కాని రాహుల్‌ పరిస్థితి కాస్త కష్టంగానే ఉంది.

ఆయన ఎలిమినేట్‌ అయితే మళ్లీ సేవ్‌ అవుతాడా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.కాని ఆ విషయాన్ని పునర్నవి ఆలోచించకుండా నో చెప్పింది.

మొదట సరే అన్నా కూడా రాహుల్‌ కాస్త ఒప్పించాడు.ఆమె మనసులో వద్దని ఉన్నా బయటకు సరే అంది, రాహుల్‌ వద్దనగానే సరే అంటూ తప్పుకుంది.

ఈ విషయమై సోషల్‌ మీడియాలో రాహుల్‌కు పున్ను నమ్మక ద్రోహం చేసిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube