బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ బాబా భాస్కర్‌, ఇది చదివితే మీరు నిజమే అంటారు  

Telugu Big Boss 3 Baba Baskar Latest Update News - Telugu Ali, Baba Baskar, Rahul, Siva Jyothi, Srimukhi, Telugubig Boss 3

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ముగింపు దశకు చేరుకుంది.మరో వారం రోజుల్లోనే బిగ్‌బాస్‌ ముగియబోతుంది.

Telugu Big Boss 3 Baba Baskar Latest Update News

చివరి వారం ఎలిమినేషన్‌లో ఉన్నది అయిదుగురు.వారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అయ్యి మిగిలిన నలుగురు ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లిన రాహుల్‌తో కలిసి ఫైనల్‌ వీక్‌లో పోటీ పడతారు.

ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన వారు అంతా కూడా మామూలుగా అయితే నాగార్జున వచ్చినప్పుడు వీకెండ్‌ ఎపిసోడ్స్‌లో మాత్రమే సేవ్‌ అవుతారు.కాని నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ అప్పుడే ఒకరిని సేవ్‌ చేశాడు.

  రాహుల్‌ మినహా ఇంట్లో ఉన్న వారు అంతా అంటే శ్రీముఖి, శివజ్యోతి, వరుణ్‌, బాబాబాస్కర్‌, అలీ ఈ అయిదుగురు కూడా ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యి ఉన్నారు.ఈ అయిదుగురిలో శివ జ్యోతి పక్కాగా ఎలిమినేట్‌ అవ్వడం కన్ఫర్మ్‌ అంటూ అంతా అనుకుంటున్నారు.ఈ నేపథ్యంలో శ్రీముఖికి అత్యధికంగా ఓట్లు వచ్చి మొదట సేవ్‌ అవుతుందని అనుకున్నారు.కాని అనూహ్యంగా బాబా భాస్కర్‌ మొదట సేవ్‌ అయ్యాడు.టికెట్‌ టు ఫినాలేను రాహుల్‌ తర్వాత బాబా దక్కించుకున్నాడు.

  ఇక ఇంట్లో ఉన్న శ్రీముఖి, శివ జ్యోతి, వరుణ్‌, అలీల్లో నేటి ఎపిసోడ్‌లో ఒక్కరు సేవ్‌ అవ్వనుండగా, ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ ఉంటుంది.ఇది ఓకే కాని ఫైనల్‌ విజేత విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి.రాహుల్‌ మరియు శ్రీముఖి మద్య గట్టి పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.

కాని శ్రీముఖి కంటే ఈ వారం బాబా భాస్కర్‌కు ఎక్కువ ఓట్లు రావడం ఆశ్చర్యంగా ఉంది.

  రాహుల్‌ మరియు బాబా భాస్కర్‌ పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు.ఈ వారంలో బాబా భాస్కర్‌ మంచి ప్రదర్శణ కనబర్చితే రాహుల్‌ కంటే కూడా అధికంగా బాబా భాస్కర్‌కు ఓట్లు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాహుల్‌ లేజీగా ఆడుతూ ఉంటాడు.

కాని బాబా మాత్రం చాలా యాక్టివ్‌.అందుకే బాబాకు టైటిల్‌ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరి మీరేమంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Big Boss 3 Baba Baskar Latest Update News Related Telugu News,Photos/Pics,Images..