నాలుగు భాషల్లో నాలుగు సినిమాలు... శోభిత దూళిపాళ్ల స్పీడ్

ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు టాలీవుడ్ తెరపై కాకుండా ఇతర భాషలలో సత్తా చాటుతున్నారు.గ్లామర్ పరంగా, అందాల ప్రదర్శనలో నార్త్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోము అన్నట్లుగా తమ జోరు చూపిస్తూ అవకాశాలు తెచ్చుకుంటున్నారు.

 Telugu Beauty Sobhita Dhulipalla Have 4 Movies In The 4 Languages, Tollywood, Bo-TeluguStop.com

నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేస్తూ దూసుకుపోతున్నారు.తెలుగమ్మాయిలు అయిన రైతు వర్మ, ఐశ్వర్య రాజేష్, ఆనంది, ఈషా రెబ్బ సౌత్ లో అన్ని భాషలలో సత్తా చాటుతున్నారు.

హైదరాబాదీ అమ్మాయి అయిన అమ్రిన్ ఖురేషి ఏకంగా ఒకేసారి రెండు బాలీవుడ్ సినిమాలలో చేసే అవకాశం తెచ్చుకుంది.ఇక తెనాలి పిల్ల శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

హాట్ బాంబ్ గా అంగాంగ ప్రదర్శనలో నార్త్ భామలకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఏకంగా అందాల పోటీల నుంచి క్యాలెండర్ గర్ల్ గా మారిపోయింది.ప్రస్తుతం బాలీవుడ్ లో ఇటు సినిమాలు, అటు వెబ్ సిరీస్ చేస్తూ తన హవాని కొనసాగిస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల పరంగా మంచి జోరు మీద ఉంది.తమిళంలో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఒక లీడ్ రోల్ లో నటిస్తుంది.

దాంతో పాటు మాతృభాష తెలుగులో అడవి శేష్ కి జోడీగా మేజర్, గూఢచారి సీక్వెల్ లలో నటిస్తుంది.వీటితో పాటు మలయాళంలో కురుప్ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

బాలీవుడ్ లో సితార అనే సినిమాలో మెయిన్ లీడ్ లో సందడి చేస్తుంది.ఈ నాలుగు సినిమాలు ఈ ఏడాది తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

ఇవి మంచి హిట్ అయితే ఆమె ఫేట్ పూర్తిగా మారిపోతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.ఇక తెలుగులో కూడా మేజర్ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు.

Telugu Languages, Bollywood, Indian, Telugusobhita, Tenali, Tollywood, Web-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube