పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న తెలుగు పిల్ల పూజిత

ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు టాలీవుడ్ లో హీరోయిన్స్ గా భాగానే రాణిస్తున్నారు.చిన్న హీరోల నుంచి మినిమమ్ హీరోల సినిమాల వరకు తెలుగమ్మాయిలని హీరోయిన్స్ గా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

 Telugu Beauty Poojitha Chance To Act In Pawan Kalyan Movie-TeluguStop.com

స్టార్ హీరోలతో అయితే తెలుగు బ్యూటీస్ కి అవకాశాలు రావడం కష్టమే అయిన కూడా వారి సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటించే ఛాన్స్ సొంతం చేసుకుంటున్నారు.పెద్ద దర్శకుడు, పెద్ద హీరోల సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా కూడా మంచి బూస్ట్ అవుతుందని ఈ అందాల భామలు కూడా వారు ఆఫర్ చేసిన పాత్రలలో నటించడానికి ఒకే చెబుతున్నారు.

సుకుమార్ రంగస్థలం సినిమాలో ఆది లవ్ చేసే అమ్మాయిగా తెలుగమ్మాయి పూజిత నటించింది.ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయిన అందరి దృష్టిని ఆకర్షించింది.

 Telugu Beauty Poojitha Chance To Act In Pawan Kalyan Movie-పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న తెలుగు పిల్ల పూజిత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత కొన్ని చిన్న సినిమాలలో పూజిత హీరోయిన్ గా కూడా నటించింది.ఆశించిన స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని పూజిత పొన్నాడ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ విప్లవ యోధుడుగా కనిపించనున్నాడు.మొఘలాయిలకి ఎదురుతిరిగే అడవిదొంగగా అతని పాత్ర ఉండబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం పూజితని క్రిష్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.సంప్రదాయబద్దంగా విలేజ్ ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది.

ఈ సాంగ్ తో పాటు సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా.

#TeluguBeauty #South Beauties #Pawer Star #Director Krish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు