చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న బ్యూటిఫుల్ యాంకర్...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే “పోవే పోరా” అనే కామెడీ షో ద్వారా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యంగ్ బ్యూటిఫుల్ యాంకర్ “విష్ణు ప్రియ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఒకటి, రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

 Telugu Beautiful Anchor Vishnu Priya Looks Stunning In Saree Look-TeluguStop.com

కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఈ అమ్మడు హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.

దాంతో విష్ణు ప్రియా యాంకర్ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించి బాగానే సక్సెస్ అయిందని చెప్పవచ్చు.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు పలు రకాల షోలు ఈవెంట్ల తో బాగానే ప్రేక్షకులను అలరిస్తోంది.

 Telugu Beautiful Anchor Vishnu Priya Looks Stunning In Saree Look-చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న బ్యూటిఫుల్ యాంకర్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే యాంకర్ విష్ణు ప్రియ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.దీంతో అప్పుడప్పుడు తనకు సంబంధించిన సమాచారాన్ని మరియు అందమైన ఫోటోలని షేర్ చేస్తోంది.

ఈ అమ్మడు తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

అయితే ఎప్పుడు మోడరన్ దుస్తులలో అందాల విందు చేసే విష్ణు ప్రియని ఒక్కసారిగా చీరలో చూసేసరికి నెటిజన్లు ఫిదా అయ్యారు.దీంతో కొంతమంది ఏకంగా అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ చెప్పిన “మేడం సార్ మేడమ్ అంతే” అనే డైలాగ్ తో కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ గ్లామర్ డోస్ బాగా పెంచిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ విష్ణు ప్రియ ఒక పక్క ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

అందువల్లనే ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ అందాల ఆరబోతతో తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే కచ్చితంగా సినిమాల్లో నటిస్తానని చెబుతోంది.అయితే అందం, అభినయం, చక్కని ముఖ కవళికలు వంటివి ఉన్నప్పటికీ ఎందుకో హీరోయిన్ గా మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతోంది.

#VishnuPriya #TeluguBeautiful #TeluguBeautiful #Vishnu Priya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు