ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ఒకప్పుడు తన జీరో సైజు నడుముతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే దేవదాసు చిత్రంతో మంచి హిట్ అందుకోవడంతో ప్రిన్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని కొంతకాలం పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగింది అయితే ఆ తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమపై మక్కువ ఎక్కువ అవడంతో అక్కడికి వెళ్లి తన సినీ జీవితాన్ని చేతులారా కష్టాల్లో కి నెట్టుకుంది.

 Telugu Beautiful Actress Ileana Childhood Photos Viral-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఇలియానా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.ఇందులో భాగంగా తన కు సంబంధించినటువంటి ఫోటోలు మరియు ఫోటో షూట్ కార్యక్రమాల్లో దిగినటువంటి బ్యూటిఫుల్ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది అయితే తాజాగా ఇలియానా తన చిన్నప్పుడు తీసుకున్నటువంటి ఫోటోని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అయితే ఈ ఫోటోలో ఇలియానా తెల్లటి స్పెషల్ దుస్తులు ధరించి తన స్నేహితులతో కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఫోటోని షేర్ చేసిన కొంతసేపటికే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.

అంతేకాక ఇలియానా అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ ఇలియానా చిన్నప్పుడు ఏంజెల్ లాగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో ప్రముఖ హీరో అభిషేక్ బచ్చన్ హీరో గా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube