ముందుతరం తెలుగు చిత్రపరిశ్రమ ఎక్కువగా తెలుగు అమ్మాయిలు హవా ఉండేది.స్టార్ హీరోయిన్లుగా ఎక్కువ మంది తెలుగు అమ్మాయిలే ఉండేవారు.
ఒక సావిత్రి నుంచి మొదలు పెడితే ఒక వాణిశ్రీ, భానుప్రియ, విజయశాంతి, రోజా, రంభ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్స్ గా తమ ప్రభావం చూపించారు.అయితే జెనరేషన్ గ్యాప్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా కెరియర్ ఎంచుకోవడం మానేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి హీరోయిన్ గా కెరియర్ ఎంచుకున్న అందాల భామలని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.సినిమాలో హీరోయిన్లు అంటే ఉన్న ఒక దురాభిప్రాయం కారణంగా పెద్దగా ఈ ఫ్యాషన్ ఫీల్డ్ వైపు అడుగులు వేయలేదు.
అయితే మారుతున్న కాలంతో అమ్మాయిల దృక్పథం కూడా మారుతుంది.దీంతో ఫాషన్ ఇండస్ట్రీలో రాణించడానికి తెలుగు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తున్నారు.
అదే సమయంలో సినిమా అవకాశాలు మంచిగా సొంతం చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఈ వరుసగా రీతూవర్మ మంచి ఫామ్ చూపిస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు మూడు తెలుగు సినిమాలు చేస్తుంది.అన్ని కూడా గుర్తింపు ఉన్న సినిమాలే.
స్టార్ హీరో విక్రమ్ తో కూడా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.అలాగే ఐశ్వర్యా రాజేష్ తమిళంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యి టాలీవుడ్ లో కూడా జెండా పాతడానికి రెడీ అవుతుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు పెద్ద తెలుగు సినిమాలు ఉన్నాయి.అందులో ఒకటి నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీశ్.
అలాగే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ తో దుమ్ము లేపిన డింపుల్ హయాతీ ప్రస్తుతం రవితేజకి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడు ఫేట్ మారిపోవడం పక్కా.
అలాగే మరో హాట్ తెలుగు బ్యూటీ శోభిత దూళిపాళ్ల.ఈ భామ ముందుగా బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి తెలుగులో కూడా తన ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
అలాగే హైదరాబాద్ నుంచి మోడలింగ్ లోకి అడుగుపెట్టిన అమ్రిన్ ఖురేషి బాలీవుడ్ ఎంట్రీతోనే రెండు సినిమాలు పట్టేసింది.త్వరలో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
అలాగే మరో తెలుగమ్మాయి ఆనంది ఇప్పటికే కోలీవుడ్ లో సక్సెస్ అయ్యింది.ఇలా తెలుగమ్మాయిలు తమ రూట్ మార్చి గ్లామర్ రోల్స్ కి కూడా సై అనడంతో వారికి తెలుగు సినిమాలలో అవకాశాలు పెరుగుతున్నాయి.