దుబాయ్ లోని తెలుగు వారి కోసం.. తెలుగు సంఘం ఏర్పాటు..!!!

భారత్ నుంచీ ప్రపంచ దేశాలకు మన భారతీయులు వలసలు వెళ్తూ ఉంటారు.అలా వలసలు వెళ్ళే వారిలో అత్యధికంగా యూఏఈ దేశాలకు వలసలు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

 Telugu Association In Dubai For Telugu Nris, Telugu Nris, Nris In Dubai, Uae, Te-TeluguStop.com

యూఏఈ లో సుమారు 5 లక్షల మంది తెలుగు ప్రవాసీయులు ఉంటారని అంచనా.అయితే దుబాయ్ లో అక్కడి ప్రభుత్వ అనుమతులతో, అక్కడి నిభందనలకు అనుగుణంగా మొట్ట మొదటి సారిగా తెలుగు అసోసియేషన్ ఏర్పాటు అయ్యింది.

దాదాపు రెండేళ్ళ పాటు కష్టపడి అన్ని నిభందనలు ఏర్పాటు చేసుకుంటూ ఎంతో మంది ఈ అసోసియేషన్ ప్రారంభిచడానికి తీవ్రంగా శ్రమించారు.దాంతో ఎట్టకేలకు దుబాయ్ ప్రభుత్వం తాజాగా తెలుగు అసోసియేషన్ కు అనుమతులు ఇవ్వడంతో అక్కడి 5 లక్షల మంది తెలుగు వారి చిరకాల కోరిక నెరవేరినట్టు అయ్యింది.

దుబాయ్ నిభంధనల ప్రకారం అక్కడి ఇద్దరు స్థానిక పౌరులు కూడా తెలుగు అసోసియేషన్ ఓ సభ్యులుగా ఉన్నారు.ప్రస్తుతం ఒక లక్ష మంది తెలుగు వారిని సభ్యులుగా చేర్చాలని భావిస్తున్నట్లుగా సంస్థ సభ్యులు ప్రకటించారు.

ఈ అసోసియేషన్ ముఖ్యంగా ప్రవాస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిందని, వారి అభివృద్దికి, వారి అవసరాలకు అనుగుణంగా సంస్థ నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రవాసులకు ఎలాంటి కష్టం వచ్చినా సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.ప్రస్తుతానికి సుమారు లక్ష మంది ప్రవాసులు సంస్థలో చేరినా వారి నుంచీ సుమారు

రూ.35 కోట్ల వరకూ సంస్థకు చేరుతుందని ఈ డబ్బును తెలుగు ప్రవాసుల సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రకటించారు.దుబాయ్ చరిత్రలో అక్కడి ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా ఏర్పడిన ఏకైక సంఘం ఇదేనని సంస్థ సేవా విభాగం ప్రకటించింది.

ఈ సంస్థకు ప్రెసిడెంట్ గా వైజాగ్ కు చెందిన దినేష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా వివేకానంద ఎన్నికయ్యారు.సంస్థలో సభ్యులుగా చేరాలన్నా, ఇతర విషయాలు తెలుసుకోవాలన్నా సంస్థ వెబ్సైటు ద్వారా తమను సంప్రదించవచ్చునని ప్రకటించారు. https://www.tauae.org/

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube