తెలుగు ఆర్టిస్టులని కన్నడలో ప్రోత్సహించరు.. కానీ..

సినిమా పరిశ్రమ అనేది యూనివర్సల్ రంగం కాబట్టి ఇందులో భాగంగా సినిమా అవకాశాలు మన దేశంలోని చిత్ర పరిశ్రమల్లోనేకాకుండా ఇతర దేశాల్లో కూడా అవకాశాలు వస్తే ఎలాంటి అభ్యంరాతలు లేకుండా వెళ్లి నటించవచ్చు. కానీ తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమకి పొరుగు సినీ పరిశ్రమ అయినటువంటి కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించడం లేదని పలు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

 Telugu Artists Is Not Encouraged In Kannada Film Industry, Telugu Movie Artists,-TeluguStop.com

అయితే ఈ విషయానికి సంబంధించి గతంలో కూడా కొందరు ప్రముఖ నటీనటులు స్పందిస్తూ ఈ విషయం వాస్తవమేనని చెబుతున్నారు.అంతేకాక కన్నడ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తెలుగు ఆర్టిస్టులకు ప్రోత్సాహం కరువవడంతో అవకాశాలు లేక వారు తెలుగు సినీ పరిశ్రమ వైపు వస్తున్నారని  దాంతో తెలుగు సినీ పరిశ్రమ లో ఉన్నటువంటి ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గుతున్నాయని టాలీవుడ్ నటి నటులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే ధారావాహికలలో దాదాపుగా ఎక్కువ మంది కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులే కనిపిస్తున్నారు.

దీంతో కొంతమంది తెలుగు ఆర్టిస్టులు కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఆర్టిస్టుల అవకాశాల కోసం ఇక్కడికి రావడంతో తమ అవకాశాలకు గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక తెలుగులో అనుభవజ్ఞులయినటువంటి ఎంతోమంది నటీనటులు లో ఉండగా దర్శకనిర్మాతలు కూడా ఇతర చిత్ర పరిశ్రమల నుంచి వచ్చినటువంటి నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది సరికాదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మరి కొందరు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ నటనారంగంలో భాషా భేదాభిప్రాయం ఉండదని దర్శక నిర్మాతలు వారు అనుకున్న పాత్రలకి ఎవరైతే సూటవుతారో వారిని ఎంచుకుంటారని అంతే తప్ప ఇతర సినీ పరిశ్రమవాళ్ళు రావడం వల్ల టాలీవుడ్ సినీ నటీనటులకు అవకాశాలు తగ్గుతున్నాయనేది కేవలం భ్రమేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక తొందరలోనే టాలీవుడ్ సినీ పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్  పరిశ్రమగా గుర్తింపు పొందుతుందని అందుకు ఎంతో సమయం పట్టదని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube