ఈ తెలుగు యాంకర్ బికినీ ఫోటోలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

Telugu Anchor Varshini Sounderajan Old Bikini Photos Viral

కొంతమంది నటీనటులకు అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ వారి ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో గుర్తింపుకు నోచుకోలేకపోయిన నటీనటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.కాగా ఆ మధ్య తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ఆయన ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఢీ అల్టిమేట్ డాన్స్ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 Telugu Anchor Varshini Sounderajan Old Bikini Photos Viral-TeluguStop.com

అయితే ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు చిత్రాలలో కూడా నటించింది.ఈ క్రమంలో 2010వ సంవత్సరంలో తమిళ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన శంభో శివ శంభో చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.

కానీ ఈ అమ్మడు నటించిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.దాంతో తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని యాంకరింగ్ రంగం వైపు అడుగులు వేసింది.

 Telugu Anchor Varshini Sounderajan Old Bikini Photos Viral-ఈ తెలుగు యాంకర్ బికినీ ఫోటోలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు…-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ప్రస్తుతం యాంకర్ వర్షిణి కి సినీ ఇండస్ట్రీలో పేరు, గుర్తింపు ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాకపోవడంతో కొంతమేర నిరాశ చెందుతోంది.

దాంతో సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందాలు ఆరబోస్తుంది.అంతటితో ఆగకుండా ఈ ఫోటోలని తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ రోజురోజుకి తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

కాగా ఆ మధ్య యాంకర్ వర్షిణి నది ఒడ్డున బీచ్ లో బికిని దుస్తులు ధరించి ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అలాగే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో ఇటీవలే కొందరు ఆకతాయిలు యాంకర్ వర్షిణి అప్పట్లో దిగిన బికినీ ఫోటోలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.అంతేకాకుండా యాంకర్  వర్షిణి కి హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయని కాబట్టి కనీసం ఇప్పటికైనా తెలుగు దర్శక నిర్మాతలు యాంకర్ వర్షిణి ప్రతిభను గుర్తించి సినిమా అవకాశాలు ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ వర్షిని తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న “శాకుంతలం” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే ఇటీవలే ఈ అమ్మడికి ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిన్న బడ్జెట్ చిత్రంలో రెండో హీరోయిన్ గా అవకాశం వరించినట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు యాంకర్ వర్షిణి మాత్రం తనకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చిన విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

#Anchor #TeluguAnchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube