ఇలా చేయలంటూ రిక్వెస్ట్ చేస్తున్న తెలుగు యాంకర్....

తెలుగు బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే టాలీవుడ్ యాంకరింగ్ “సుమ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సుమ ప్రస్తుతం ఒకపక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించాలంటూ ప్రచారం చేస్తోంది.

 Telugu Anchor Suma Requesting For Wear Mask, Suma, Telugu Anchor, Corona Virus,-TeluguStop.com

కాగా తాజాగా యాంకర్ సుమ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియో ని షేర్ చేసింది. అయితే ఇందులో ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని కోరింది.

 అంతేగాక ఒకవేళ మనకి ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉన్నప్పటికీ ఇతరులలో కరోనా వైరస్ ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి కచ్చితంగా ఇతరులతో సంభాషించే సమయంలో మాస్క్ ను ధరించాలని సూచించింది.

 ఇలా చేయడం వల్ల మనం మనకి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పుకొచ్చింది.దీంతో యాంకర్ సుమ చేసినటువంటి ఈ మంచి పనికి పలువురి నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ సుమ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రసారమయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో” మరియు “స్టార్ మహిళ” తదితర షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అంతేగాక పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఆహాలో  కూడా బాగానే రాణిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube