ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న తెలుగు యాంకర్ ఎవరో గుర్తు పట్టారా..?

ఆడియో ఫంక్షన్, ఈవెంట్, గేమ్ షో లేదా ముఖాముఖి ఇంటర్వ్యూ ఇలా ఏదైనా సరే తనదైన శైలిలో యాంకరింగ్ నిర్వహిస్తూ తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న తెలుగు ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ సుమ కనకాల కేరళలో పుట్టినప్పటికీ తన తల్లిదండ్రులు హైదరాబాదులో సెటిల్ కావడంతో తన విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసింది.

 Telugu Anchor Suma Kanakala Childhood Photos Viral, Telugu Anchor, Suma Kanakala-TeluguStop.com

ఆ తర్వాత 1999వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ సుమ కనకాల స్వతహాగా తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగు భాషపై ప్రావీణ్యం సంపాదించి ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్ గా రాణిస్తోంది.

అయితే తాజాగా యాంకర్ సుమ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా ఇందులో సుమ కాలేజీ లో చదువుకునేటప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న సమయంలో చీర కట్టుకొని అచ్చమైన తెలుగు అమ్మాయిలా నాట్యం చేస్తూ కనిపించింది.

అంతేగాక తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.దీంతో కొందరు సుమ కనకాల నెటిజన్లు సుమ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అంతే చలాకీగా ఉందంటూ సరదాగా కామెంట్లు చేస్తుంటారు.

Telugu Suma Kanakala, Sumakanakala, Telugu Anchor, Teluguanchor, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా గత పది సంవత్సరాలుగా యాంకర్ సుమ తెలుగు బుల్లితెరపై చానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని ఛానెళ్ళని కవర్ చేస్తూ పలు రకాల పూలతో ప్రేక్షకులని బాగానే అలరించింది కాగా ప్రస్తుతం సుమ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో” అనే షోలో యాంకరింగ్ నిర్వహిస్తోంది.దీంతో ప్రతి వారం కొత్త కొత్త గెస్ట్ లతో ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube