యాంకర్ రవి : మేం కలిసి నటించినందుకు ఏకంగా మొగుడు పెళ్ళాలని అనుకున్నారు.. కానీ...

తెలుగులో తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “యాంకర్ లాస్య” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే యాంకర్ లాస్యతో పాటూ అదే సమయంలోనే అందరికీ టాలీవుడ్ హీరో మరియు యాంకర్ రవి కూడా గుర్తొస్తాడు.

 Telugu Anchor Ravi About His Relation With Female Anchor Lasya Manjunath, Ravi,-TeluguStop.com

 అంతగా వీరిద్దరి బాండింగ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.అంతేకాక ఒకానొక సమయంలో ఇద్దరూ ఉంటేనే షో హిట్టవుతుందనే కారణంగా లాస్య రవి లకు సమానంగా అవకాశాలను ఇచ్చేవారు.

ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరు లేకపోయినా కూడాఇంకొకరికి అవకాశం ఇచ్చేవారు కాదు.

అయితే తాజాగా ఆ మధ్య కాలంలో యాంకర్ రవి మరియు లాస్య మంజునాథ్ ల మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

  దీంతో తాజాగా యాంకర్ రవి ఈ విషయంపై ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో స్పందించాడు. అయితే ఇందులో భాగంగా తాము స్క్రీన్ మీద చేసినటువంటి షోలు, ఈవెంట్లు బాగా హిట్ అయ్యాయని అందువల్లనే కొందరు తమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశాడు.

 అంతేగాక ప్రస్తుతం ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీ గా తన జీవితాన్ని గడుపుతుందని తనకు ఎంతో సంతోషంగా ఉందని కూడా తెలిపాడు. అయితే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు గానీ లేదా ఆమె పెళ్లి కి గాని తనకు ఎలాంటి సమాచారం లేదని అయితే అది తమ వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రవి ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూనే  మరోపక్క షోలు ఈవెంట్లలో కూడా యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే రాణిస్తున్నాడు.కాగా యాంకర్ లాస్య ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతున్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube