ఈ యాంకర్ అలాంటి పని చేయడంతో కేసు పెట్టారు... చివరికి..

తెలుగు బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ “టాలీవుడ్ యాంకర్ ప్రశాంతి” గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ ప్రశాంతి ఆ మధ్య తమిళ దర్శకుడు శ్రీ రాజన్ దర్శకత్వం వహించిన “ఎఫైర్” అనే చిత్రంలో కూడా స్వలింగ సంపర్కురాలి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.

 Telugu Anchor Prasanthi Cine Career News-TeluguStop.com

కానీ అనుకోకుండా ఆమె జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన కారణంగా యాంకర్ ప్రశాంతి సినీ జీవితం కొంతమేర చతికిలపడింది.

అయితే ఆ మధ్య ఈ అమ్మడు హైదరాబాదులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మద్యం సేవించి స్టేడియంకి వచ్చి నానా హంగామా చేసింది.

 Telugu Anchor Prasanthi Cine Career News-ఈ యాంకర్ అలాంటి పని చేయడంతో కేసు పెట్టారు… చివరికి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఇది గమనించిన కొందరు ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.అంతేగాక ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్నటువంటి ఓ వ్యక్తి నటి ప్రశాంతిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

దీంతో పబ్లిక్ న్యూసెన్స్ విషయమై పలు సెక్షన్ల కింద పోలీసులు ఈ అమ్మడి పై కేసు నమోదు చేశారు.దీంతో అప్పట్లో ఈ విషయం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది.

అయితే సెలబ్రెటీల విషయంలో ఇది సర్వసాధారణమయినప్పటికీ ఈ విషయం మాత్రం ప్రశాంతి సినీ కెరియర్ పై బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.అప్పటి వరకు పలు ఈవెంట్లు, షోలు, తదితర వాటితో బిజీగా గడుపుతున్న ప్రశాంతి కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయింది.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ప్రశాంతి తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా లో ప్రసారమయ్యే “ఇంటింటి గృహలక్ష్మి” ధారావాహికలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్రలో అన్నమయ్య మూవీ ఫేమ్ వెటరన్ హీరోయిన్ కస్తూరి శంకర్ నటిస్తోంది.అయితే ఈ అమ్మడు తెలుగులో ఎఫైర్, అనగనగా అలా జరిగింది, అనే రెండు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.

కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి ఎలాంటి గుర్తింపు లభించలేదు.దీంతో ప్రస్తుతం సీరియళ్లపై దృష్టి సారిస్తోంది.

#Prasanthi #TeluguAnchor #PublicNews #TeluguAnchor #F.I.RFile

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు