యాంకర్ ప్రదీప్ ఇంట్లో తీవ్ర విషాదం.. !

ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఎవరి నోటి వెంట దుర్వార్త వినవలసి వస్తుందో తెలియడం లేదు.అసలు ఈ సంవత్సరం చివరి వరకు ఎంత మంది బ్రతుకుతారో చెప్పలేని పరిస్దితి.

 Telugu Anchor Pradeep Machirajus Father-TeluguStop.com

కరోనా వల్లనా, అనారోగ్యాల వల్లనా ఏదైతే నేమి మొత్తానికి రోజు మరణ వార్తలు మాత్రం చెవిన పడకుండా ఉండలేక పోతున్నాయి.

ఇకపోతే బుల్లితెర కింగ్ అని పేరు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

 Telugu Anchor Pradeep Machirajus Father-యాంకర్ ప్రదీప్ ఇంట్లో తీవ్ర విషాదం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన తండ్రి పాండురంగ మాచిరాజు నిన్న రాత్రి మృతి చెందినట్లుగా సమాచారం.కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండురంగ మాచిరాజును చికిత్స నిమిత్తం ఇటీవల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయగా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈమేరకు ప్రదీప్ తండ్రికి పలువురు బుల్లితెర, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల యాంకర్ ప్రదీప్ కూడా కరోనా బారిన పడ్డారని ప్రచారం జరిగింది.

కానీ ఈ విషయం లో ప్రదీప్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది.

#AnchorPradeep #Health Issues #Father Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు