నా పదేళ్ల వయసులో నాన్న చనిపోయాడు... అమ్మ కూడా వదిలేసింది... దాంతో...

తెలుగు బుల్లితెరపై పలు షోలు ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ యాంకర్ “మధు కృష్ణన్” గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు.అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ సపోర్టు లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన యాంకర్ “మధు కృష్ణన్” సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో చాలా సమస్యలను ఎదుర్కొంది.

 Telugu Anchor Madhu Krishnan Real Life And Facing Struggles In Childhood Time-TeluguStop.com

అయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి అవకాశాలను ఒడిసి పట్టుకుని ప్రస్తుతం ఓ మోస్తరుగా బాగానే రాణిస్తోంది.కాగా తాజాగా యాంకర్ మధు కృష్ణన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం మరియు సినీ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తనకి 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి మరణించాడని, దాంతో తన తల్లి కూడా తనను వదిలి పెట్టి తన తల్లిదండ్రులతో వెళ్లిపోయిందని ఎమోషనల్ అయ్యింది.ఆ తర్వాత తన నానమ్మ, తాతయ్యలు తనని కష్ట పడి పెంచి పెద్ద చేశారని, అలాగే తనను చదివించడానికి చాలా కష్టాలు పడ్డారని తన నానమ్మ తాతయ్యల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పుకొచ్చింది.

 Telugu Anchor Madhu Krishnan Real Life And Facing Struggles In Childhood Time-నా పదేళ్ల వయసులో నాన్న చనిపోయాడు… అమ్మ కూడా వదిలేసింది… దాంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే చిన్నప్పటి నుంచి తను చాలా కష్టాలు అనుభవించడంతో సమస్యలను ఎదుర్కొని నిలబడే సామర్థ్యం తనలో ఎక్కువగా ఉందని అందువల్లనే సినిమా పరిశ్రమలో తన నటనా ప్రతిభను నిరూపించుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.అలాగే మన వద్ద ఉన్న ఆస్తిపాస్తులను చూసి మనకి విలువ ఇచ్చేవాళ్ళ కన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయి అందించి ఆదుకున్న వాళ్లే మనం నిజమైన శ్రేయోభిలాషులని అలాంటి వాళ్ళని ఎప్పుడూ వదులుకోకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Telugu Childhood Time, Madhu Krishnan, Madhu Krishnan Struggles, Telugu Anchor, Telugu Anchor Madhu Krishnan Real Life And Facing Struggles In Childhood Time-Movie

అలాగే యాంకరింగ్ అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో గీతా ఆర్ట్స్ సంస్థలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్న వ్యక్తి తనకు చాలా సహాయం చేశాడని తెలిపింది.అయితే ఆ వ్యక్తి ఎవరో కాదని ప్రముఖ పిఆర్ ఏలూరు శ్రీను అని పేర్కొంది.అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇద్దరు దంపతులు చాలా సహాయం చేశారని తొందర్లోనే వారిని స్క్రీన్ పై చూపిస్తానని కూడా చెప్పుకొచ్చింది.ఇక సినిమా ఇండస్ట్రీ పరంగా తాను కాంట్రవర్సీలకి మరియు ఇతర సమస్యలకి చాలా దూరంగా ఉంటానని అందువల్లనే ఇండస్ట్రీలో తనకి పెద్దగా స్నేహితులెవరూ ఉండరని తెలిపింది.

#Madhu Krishnan #Anchor #TeluguAnchor #MadhuKrishnan #Childhood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు