సిగరెట్లు తాగినంత మాత్రాన చెడిపోయినట్లు కాదు... చీర కట్టుకున్న వాళ్ళందరూ పతీవ్రతలు కాదు...

తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ అయిన ఈ టీవీలో అప్పట్లో ప్రసారమయ్యే ఓ షో ద్వారా యాంకర్ కీర్తి రెడ్డి బాగానే పాపులర్ అయ్యింది.ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు ద్వారా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

 Telugu Anchor Keerthi Reddy Smoking In Youtube Interview Viral-TeluguStop.com

కాగా తాజాగా యాంకర్ కీర్తి రెడ్డి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి మీరు ధూమ పానం, మద్యం సేవిస్తారా.? అంటూ ప్రశ్నించాడు.అంతేకాకుండా తను క్రితంసారి గోవా కి వెళ్ళిన సమయంలో ధూమ పానం చేస్తున్నట్లు తన వద్ద ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పాడు.

 Telugu Anchor Keerthi Reddy Smoking In Youtube Interview Viral-సిగరెట్లు తాగినంత మాత్రాన చెడిపోయినట్లు కాదు… చీర కట్టుకున్న వాళ్ళందరూ పతీవ్రతలు కాదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో యాంకర్ కీర్తి రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ తను గోవా కి వెళ్ళినప్పుడు ధూమ పానం చేయలేదని కానీ హుక్కా తాగానని తెలిపింది.అలాగే సిగరెట్ తాగడం మరియు హుక్కా తాగడం రెండూ వేరని కూడా స్పష్టం చేసింది.

అంతటితో ఆగకుండా ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో తన పక్కనే సిగరెట్ పెట్టె ఉండటంతో వెంటనే అందుకొని స్మోకింగ్ చేసింది.

దీంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ అవాక్కయ్యాడు.దాంతో తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి పనులు చేయకూడదనే విషయం పూర్తిగా తన వ్యక్తిగతమని అందులో ఇతరుల నిర్ణయాలను తాను అస్సలు ఒప్పుకోనని స్పష్టం చేసింది.అలాగే చాలా మంది మహిళలకి తనలాగే జీవితం గడపాలని ఉంటుందని కానీ వారి యొక్క వ్యక్తి వ్యక్తిగత జీవితం మరియు ఇతరుల ఏమనుకుంటారో వంటి వాటివల్ల తమ లైఫ్ ని సరిగ్గా లీడ్ చెయ్యలేకపోతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అయితే మగవాళ్ళ లాగానే అమ్మాయిలకు కూడా మద్యం సేవించడం, పొగ త్రాగడం, నచ్చిన బట్టలు వేసుకోవడం వంటి హక్కులు ఉంటాయని అలాగే సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం వంటివి అలవాట్లు ఉంటే చెడిపోయినట్లు కాదని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా ఆడవాళ్లు మద్యం సేవించకూడదని, పొగ త్రాగ కూడదని ఎక్కడా రూల్ లేదని కూడా తెలిపింది.

దీంతో యాంకర్ కీర్తి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Keerthi #Anchor #TeluguAnchor #Keerthi Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు