ఆ తెలుగు యాంకర్ రెండో పెళ్లి చేసుకోబోతుందట...

తెలుగులో ఒకప్పుడు తన గలగల మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ యాంకర్ “ఝాన్సీ” గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ ఝాన్సీ యాంకరింగ్ రంగంలో మాత్రమే కాకుండా టాలీవుడ్లో పలు చిత్రాలను కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Telugu Anchor Jhansi Second Marriage News, Jhansi, Telugu Anchor, Telugu Anchor-TeluguStop.com

అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటుడు మరియు రైటర్ జోగినాయుడు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్ళైన కొత్తలో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

 కానీ అనుకోకుండా కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి యాంకర్ ఝాన్సీ తన కూతురుతో కలిసి ఒంటరిగా ఉంటోంది.

కాగా ఈ ఈ మధ్య కాలంలో యాంకర్ ఝాన్సీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే యాంకర్ ఝాన్సీ త్వరలో మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతుందని కొందరు తెగ ప్రచారం చేస్తున్నారు.

అంతేకాక యాంకర్ ఝాన్సీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా సినిమా పరిశ్రమకి చెందిన వాడని, అలాగే సినిమా పరిశ్రమలోని ఓ ప్రముఖ దర్శకుడి స్నేహితుడని కూడా చర్చించుకుంటున్నారు.కానీ యాంకర్ ఝాన్సీ మాత్రం ఇప్పటి వరకు తన పెళ్లి ఈ విషయంపై వినిపిస్తున్న వార్తల గురించి స్పందించలేదు.

కానీ గతంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో యాంకర్ ఝాన్సీ తన రెండో పెళ్లి విషయంపై మాట్లాడుతూ ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోబోయే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పేసింది.కానీ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో కొందరు సన్నిహితులు యాంకర్ ఝాన్సీ కి కూడా పెళ్లి గురించి సలహాలు ఇస్తున్నారట.

మరి యాంకర్ ఝాన్సీ తన రెండో పెళ్లిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube