ఈ యాంకర్ 21 ఏళ్లకే పెళ్లి చేసుకుందట... దాంతో సినిమాల కోసం...

ఆడియో ఫంక్షన్ అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా, డిబేట్ అయినా ఏదైనా సరే తన గలగల మాటలతో ప్రేక్షకులను కట్టి పడేసేటువంటి యాంకర్ గాయత్రి భార్గవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Actress Gayatri Bhargavi Marriage And Career Life News,gayatri Bhargavi, Telugu-TeluguStop.com

అయితే ఈమె మొదటిగా యాంకర్ గానే సినిమా పరిశ్రమకి పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా గాయత్రి భార్గవి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవిత ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తను ఎంతో స్ట్రిక్ట్ గా గా పెంచారని తెలిపింది.

దీంతో తన తల్లిదండ్రులకి తాను సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం ఉండేది కాదని చెప్పుకొచ్చింది. అంతేగాక తాను 21 సంవత్సరాల వయసులోనే మేజర్ విక్రమ్ అనే ఆర్మీ ఆఫీసర్ ని ళ్లి చేసుకున్నానని దాంతో మొదట్లో తన కుటుంబ సభ్యులు యాంకర్ గా అయితే ఓకే గాని సినిమాల్లో నటించడానికి మాత్రం అస్సలు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.

కానీ ఎలాగోలా కష్టపడి తన కుటుంబ సభ్యును ఒప్పించి సినిమాల్లో నటించడానికి అనుమతి తీసుకుందట.ఆ విధంగా తాను సినిమాల్లో నటించడానికి కష్టపడ్డానని సరదాగా తెలిపింది.

అయితే తెలుగులో నటి భార్గవి అక్క, అమ్మ, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.అంతేగాక మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవి తేజ తదితర స్టార్ హీరోలతో కలిసి పని చేసింది.

ప్రస్తుతం భార్గవి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube