బాగానే సన్నబడిన తెలుగు యాంకర్.. అందుకేనా...?

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ అయినటువంటి ఈ టీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే “పటాస్” ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ యాంకర్ “భాను శ్రీ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే భాను శ్రీ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఒకటి, రెండు చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది.

 Telugu Anchor Bhanu Sri Weight Loss For Movie Offers In Film Industry-TeluguStop.com

కానీ ఆ చిత్రాలు కనీసం విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.దాంతో ఆ తర్వాత ఈ అమ్మడు యాంకరింగ్ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించి బాగానే సక్సెస్ అయింది.

ఈ మధ్య కాలంలో యాంకర్ భాను శ్రీ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పలు ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులని బాగానే అలరిస్తోంది.అయితే ఈ మధ్య యాంకర్ భాను శ్రీ షేర్ చేసిన ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే యాంకర్ భాను శ్రీ జిమ్ జిమ్ వర్కౌట్లు చేస్తూ, అలాగే ప్రత్యేక ఆహారపు డైట్ ని పాటిస్తూ బాగానే బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

 Telugu Anchor Bhanu Sri Weight Loss For Movie Offers In Film Industry-బాగానే సన్నబడిన తెలుగు యాంకర్.. అందుకేనా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు ఒక పక్క పలు ఈవెంట్లలో నటిస్తూనే మరో పక్క సినిమా హీరోయిన్ గా కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.అందువల్లనే ఫిజిక్ మెయింటినెన్స్ కోసం బాగానే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ భాను శ్రీ “నల్లమల” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో పలు టాలీవుడ్ చిత్రాలలో విలన్ గా నటించి మెప్పించిన ప్రముఖ నటుడు “అమిత్ తివారి” హీరోగా నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ నూతన దర్శకుడు “రవి చరణ్” దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన లభించింది.

అలాగే ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన “ఏమున్నావే పిల్ల” అనే పాట యూట్యూబ్ లో తెగ ట్రెండింగ్ అవుతోంది.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#Bhanu Sri #TeluguAnchor #TeluguAnchor #TeluguFilm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు