అలాంటి కుటుంబంలో పుట్టా... ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు...

తెలుగు బుల్లితెరపై తనగల మాటలతో  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ “అనసూయ భరద్వాజ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అనసూయ భరద్వాజ్ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది.

 Telugu Anchor Anasuya About Her Dressing Style And Career Opportunities-TeluguStop.com

అయితే ఇందుకుగాను యాంకర్ అనసూయ దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే తాజాగా యాంకర్ అనసూయ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే తన గురించి ఏమీ తెలియనటువంటి కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో తను ధరించేటువంటి బట్టలపై మరియు తన ప్రవర్తన పై చాలా అసభ్యకరంగా కామెంట్లు చేస్తుంటారని అయినా వాటిని తాను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేసింది.అలాగే పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడే ప్రేమలో పడి తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నానని ఈ విషయం ఇప్పటికే చాలా సందర్భాలలో చెప్పానని కూడా తెలియజేసింది.

 Telugu Anchor Anasuya About Her Dressing Style And Career Opportunities-అలాంటి కుటుంబంలో పుట్టా… ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక తాను అచ్చమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానని దాంతో తనకు ఎలాంటి బట్టలు ధరించాలి అలాగే తనకు ఎలాంటి దుస్తులయితే సౌకర్యంగా ఉంటాయనే విషయంపై తనకు అవగాహన ఉందని కూడా స్పష్టం చేసింది.కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో తాను చాలా విషయాలు నేర్చుకున్నానని అలాగే తన జీవన శైలిలో కూడా చాలా మార్పులు చేసుకున్నాయని తెలిపింది.

అలాగే తెలుగు దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” చిత్రంలోని రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత తనకు అలాంటి పాత్రలలో నటించే అవకాశాలు చాలానే వచ్చాయని కానీ తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపింది.

అంతేకాక తాను ఇలాంటి పాత్రలకే సూటవుతానని కొందరు ప్రచారాలు చేశారని కానీ తాను నటి స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలని అందువల్లనే కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి తాను ఎప్పుడూ ముందుంటానని కూడా స్పష్టం చేసింది.

కాగా ప్రస్తుతం అనసూయ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

#TeluguAnchor #TeluguAnchor #AnasuyaAbout #AnasuyaAbout #Rangasthalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు