మందు కొట్టి ఉప్పల్‌ స్టేడియంలో రచ్చ చేసిన తెలుగు యాంకర్‌పై కేసు నమోదు  

Telugu Anchor Nuisance In Uppal Stadium-hyderabad,kolkata,movie Updates,police,telugu Anchor

ఒక వైపు క్రికెట్‌ అభిమానులు ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ మరియు కోల్‌కత్తా మద్య జరుగుతున్న రసవత్తర పోరును చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఒక చోట మాత్రం కొంత మంది తెగ హడావుడి చేస్తున్నారు. గొడవ గొడవ చేస్తున్న కారణంగా పక్కన ఉన్న క్రికెట్‌ అభిమానులకు కూడా ఇబ్బంది కలిగింది..

మందు కొట్టి ఉప్పల్‌ స్టేడియంలో రచ్చ చేసిన తెలుగు యాంకర్‌పై కేసు నమోదు-Telugu Anchor Nuisance In Uppal Stadium

వారు తాగి వచ్చి నానా రచ్చ చేస్తున్నట్లుగా వారికి అర్థం అయ్యింది. ఏంటీ ఈ రచ్చ అనుకుంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కెమెరాల్లో కూడా చిక్కిన వారి హడావుడికి పోలీసులు సీరియస్‌ అయ్యారు.

వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులకు అందులో యాంకర్‌ ప్రశాంతి ఉందని తెలిసింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించడంతో పాటు, పలు బుల్లి తెర షోలపై కనిపించిన ప్రశాంతి ఈ గొడవ అంతటికి కారణం అంటూ పోలీసులు నిర్థారించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగత పూచికత్తుపై వెంటనే వదిలేశారు.

ప్రశాంతితో పాటు ఆమె స్నేహితులు ప్రియ, పూర్ణిమ, శ్రీకాంత్‌ రెడ్డి, సురేష్‌, వేణుగోపాల్‌ ఇంకా ఇద్దరు కలిసి మ్యాచ్‌ చూశారు. ఆ సమయంలోనే వారు తాగి రచ్చ చేశారు. దాంతో ఇతర ప్రేక్షకులు వారిపై న్యూసెన్స్‌ కేసు పెట్టడం జరిగింది.

వీరిపై న్యూసెన్స్‌ కేసు నమోదు అయిన నేపథ్యంలో ప్రశాంతి పరువు పోయినట్లయ్యింది. తాగి ఎగరడం ఏంటీ అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలు తాగడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..